Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి

  • వైద్య, పోలీసు సిబ్బందికి పూర్తి వేతనం
  • ఇన్సెంటివ్‌ ‌కూడా..  చికిత్స అందిస్తున్న వైద్యులకు  పిపిఇ కిట్లు, ఎన్‌ 95 ‌మాస్కులు
  • కొరోనా కట్టడిపై సీఎం కేసీఆర్‌ ‌సుదీర్ఘ సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్పష్ఠం చేశారు. అయితే, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు. వైరస్‌ ‌వ్యాప్తిని నిరోధించడానికి విశేష కృషి జరుపుతున్న వైద్య, పోలీసు సిబ్బందికి మార్చి నెల పూర్తి నెల వేతనం చెల్లించాలని నిర్ణయించారు. ఈ రెండు శాఖల ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహం (ఇన్సెంటివ్‌) ‌కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి, రోగులకు అందుతున్న చికిత్స,, వైద్య సిబ్బంది భద్రతకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ ‌బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు విస్త•త స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌, ‌డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, హెల్త్ ‌యూనివర్సిటీ వైస్‌ ‌చాన్స్‌లర్‌ ‌కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ ‌మాట్లాడుతూ కొరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. మరికొద్ది రోజుల పాటు ప్రజలు సహకరిస్తే తెలంగాణ రాష్ట్రంలో వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. కొరోనా పాజిటివ్‌ ‌బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదనీ, అందులో భాగంగా వారందరికీ అవసరమైన పిపిఇ కిట్స్, ఎన్‌ 95 ‌మాస్కులు, హైడ్రాక్సిక్లోరోక్విన్‌ ‌మాత్రలు, అజిత్రోమైసిన్‌ ‌టాబ్టెల్లు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన మెడికల్‌ ‌కిట్లను కూడా సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. వ్యాధి వచ్చిన వారికి వైద్యం అందించడానికి, వైద్యం అందిస్తున్న మెడికల్‌ ‌సిబ్బంది భద్రతకు, వైరస్‌ ‌వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటున్నదని వెల్లడించారు.

వ్యాధి వచ్చిన వారికి వైద్యం అందించడానికి, వైద్యం అందిస్తున్న మెడికల్‌ ‌సిబ్బంది భద్రతకు, వైరస్‌ ‌వ్యాప్తి చెండకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటున్నదని ఈ సందర్భంగా సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. కాగా ఈ సమావేశంలో నిజాముద్దీన్‌ ‌మర్కజీకి వెళ్లొచ్చిన వారికి, వారి వల్ల వారి కుటుంబ సభ్యులకు మాత్రమే తెలంగాణలో కొత్తగా వైరస్‌ ‌సోకుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. బుధవారం జరిపిన పరీక్షలలో కేవలం మర్కజీ యాత్రికులకే 30 మందికి వైరస్‌ ‌సోకినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. గాంధీ ఆసపత్రిలో ఇద్దరు, యశోదా ఆసుపత్రిలో మరణించిన వ్యక్తితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కొరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరినట్లు వెల్లడించారు. మరణించిన వారంతా మర్కజీకి వెళ్లి వచ్చిన వారేననీ, గత కొద్ది రోజులుగా తెలంగాణలో నమోదవుతున్న పాజిటివ్‌ ‌కేసులన్నీ మర్కజీకి వెళ్లి వచ్చిన వారివిగానే తేలాయి.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy