జన్నారం, మే 12, ప్రజాతంత్ర విలేఖరి : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని న్యాయ, దేవాదయ, అటవీశాఖ మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజున మండలంలోని కలమడుగు వివేకానంద ఆంగ్లమ పాఠశాలలో ట్రస్మా ధ్వర్యంలో 100 నిరుపేద కుటుంబాలకు, పత్రిక విలేఖరులకు 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ లు మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, బయటికి వెళ్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ 12 కిలోల బియ్యం, 1500 రూపాయాలు అందజేశారని తెలిపారు. రైతులకు 25 వేల లోపు ఉన్నవారికి ఋణమాఫీ చేసి రైతు బాంధవుడయ్యాడని అన్నారు. లాక్డౌన్ సమయంలో ఎంతో మంది నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి వారికి ట్రస్మా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేయడం అభినందనీయ మని అన్నారు.
ట్రస్మా ఆధ్వర్యంలో చేపట్టినసేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిబి చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఎంపిపి సరోజన, జెడ్పీటిసి చంద్రశేఖర్, వైస్ ఎంపిపి వినయ్ కుమార్, సర్పంచ్ యాదగిరి కార్తీక్‌రావు, ఎంపిటిసి స్వరూప రాణి, ఆలయ కమిటి చైర్మన్ స్వదేశ్ రావు, ఉప సర్పంచ్ రాజగౌడ్, టిఆర్ఎస్ అధ్యక్షుడు రాజారాంరెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ సతీష్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, జిల్లా అధ్యక్షుడు విష్ణు వర్థన్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి శరత్ కుమార్, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మధుసుధన్, సత్తన్న, పద్మ చరణ్, మండల అధ్యక్షుడు పోషన్న, కరస్పాండెంట్ సతీష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.