Take a fresh look at your lifestyle.

పర్యావరణ పరిశుభ్రతకు ప్రజలు భాగస్వాములు కావాలి

People need partners for environmental hygiene

రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్రంలో ఒక సాంఘీక మార్పునకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన వనపర్తి మున్సిపాలిటి పరిధిలోని ఐదవ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతు పర్యావరణం, పారిశుద్ద్యం పచ్చదనం పట్ల ప్రజలలో క్రియాశీలక బాధ్యత మరింత పెంచాలన్న ఉద్దేశ్యంతో ప్రజలకు సంబంధించిన పనులను వారే చేసుకునేలా అలాగే స్థానిక సంస్థల బాధ్యతలను పెంచేందుకు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ద్వారా మున్సిపల్‌, ‌పంచాయితి రాజ్‌ ‌సంస్థలు బాధ్యతగా పారదర్శకంగా పని చేసేందుకు నూతన మార్పునకు పెద్ద నాంది అని అన్నారు. గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించునట్లు గాని ఈ నెల 24 నుండి మార్చి 4 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సైతం అన్ని మున్సిపాలిటీలలో నిర్వహించడం జరుగుతుందని, ఇవి నిరంతర కార్యక్రమాలి అని చెప్పారు.

 

పట్టణ త్రగతి కార్యక్రమంలో వార్డు కమిటీలు, ప్రత్యే అధికారి, కౌన్సిలర్లు అందురు తిరిగి వార్డులోని సమస్యలను గుర్తించి తక్షణమే తీర్చేవి, భవిష్యత్తులో తీర్చేవి గా విభజించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అంతేకాక పట్టణ ప్రగతి పై ఈ 10  రోజుల కార్యక్రమంలో ప్రజలలో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్‌ ‌పట్టణ ప్రాంతాలలో పనులు చేపట్టేందుకు మున్సిపల్‌ ‌నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల నిధులు విడుదల చేస్తుందని వనపర్తి మున్సిపాలిటీకి ప్రతి నెల 62 లక్షల రూపాయలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. మున్సిపాలిటి నిధులతో పాటు ప్రభుత్వం ఇచ్చే నిధులను ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు సద్వినియోగం చేయాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని అంతేకాక సిసి రోడ్లు , డ్రైనేజీలు పరిశుభ్రం చేయాలని దీర్ఘకాలికంగా ఉపయోగపడే దహన వాటికలు, స్మశాన వాటికలను చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం వనపర్తి పట్టణంలో పీర్లగుట్ట సమీపంలో ఒక స్మశానవాటిక ఉందని అయితే పట్టణ ప్రజలు అందరికి ఇది అనువుగా లేనందున కాశింనగర్‌, ‌చిట్యాల, గోపాల్‌పేట, రోడ్లలో ప్రభుత• వస్థలాలను గుర్తించిస్మశాన వాటకలను దహన వాటికలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. రోడ్ల పై కూరగాయలు అమ్మకుండా ఇటీవలే వనపర్తి పట్టణంలో మార్కెట్లు ప్రారంభించామని అధునాతన మార్కెట్‌ ‌యార్డుకు 15 కోట్లతో నిర్మిస్తామని ఏకో పార్కు సమీపంలో దారి వెంహడి మార్కెట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు మద్దతు తెలిపారు.పట్టణంలో పారిశుద్ద్యంతో పాటు హరితహారం మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కలు 85శాతం తప్పనిసరిగా బతికించాలని లేనట్లైతే వార్డు కౌన్సిలర్‌ ‌పదవి పోతుందని హెచ్చరించారు. మున్సిపాలిటిలో 75 గజాలవరకు ఏలాంటి రుసుం లేకుండా ఇళ్లు నిర్మించుకోవచ్చని 1రూ.కే నల్లా కన్‌క్షన్‌ అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని మంత్రి వెల్లడించారు.

Leave a Reply