ఆధార్-ఫోన్ నెంబర్‌తో రౌషన్ కార్డు అనుసంధానం కోసం తంటాలు
ప్రజాతంత్ర, హైదరాబాద్ : పలు జిల్లాల్లో ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ఆధారంగా రేషన్ సరకులను సిబ్బంది పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్‌కార్డుదారులు ఆధార్‌కు ఫోన్ నంబర్ అనుసంధానం చేసుకోవాలని అధికారులు కోరారు. దీంతో ఆధార్-ఫోన్ నంబర్ అనుసంధానం కోసం పెద్ద సంఖ్యలో ఆధార్ కేంద్రాలకు ప్రజలు వస్తున్నారు.
ఆదిలాబాద్ ఆధార్ కేంద్రం వద్ద ఉదయం నుంచే స్థానికులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. ఆధార్ కేంద్రం తెరవలేదని సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కొరోనా నేపథ్యంలో వేలిముద్రకు బదులు ఐరిస్ లేదా మొబైల్ నంబరు ఓటీపీ ద్వారా రేషన్ సరకుల పంపిణీ ఫిబ్రవరి 1 నుంచి మొదలైంది. ఆధార్ సంఖ్యతో మొబైల్ నంబరు అనుసంధానం అయితేనే ఓటీపీ వస్తుంది.
చాలామంది ఇలా అనుసంధానం చేసుకోకపోవడంతో వారికి సంబంధిత సేవలు అందించడంపై తపాలాశాఖ కూడా దృష్టిపెట్టింది.