Take a fresh look at your lifestyle.

విజయవాడలో వ్యాక్సిన్‌ ‌కోసం జనం తంటాలు

కోవిడ్‌ ‌వాక్సినేషన్‌ ‌కోసం నగరవాసులు తంటాలు పడుతున్నారు. ఫస్ట్ ‌డోస్‌ ఇప్పటి వరకు దొరకని పరిస్థితి నెలకొంది. సెకండ్‌ ‌డోస్‌ ఎక్కడ వేస్తారు అన్న దానిపైన పూర్తి స్పష్టతలేని  వైనం. మరోవైపు వ్యాక్సినేషన్‌ ఎక్కడ దొరుకుతుందో తేలిక నగరవాసులు విజయవాడలోని అన్ని సచివాలయాలకు తిరుగుతున్నారు. ప్రభుత్వం అధికారుల వైఫల్యం అంటూ ప్రజలు తిరగబడుతున్నారు. తమ ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. కో వ్యాక్సిన్‌ ఒక చోట, కోవి షీల్డ్ ఒక చోట పెట్టాలని డిమాండ్‌ ‌చేశారు. ఇంతవరకు ఏది ఎక్కడ దొరుకుతుందో సరైన సమాచారాన్ని సచివాలయ ఉద్యోగులు, అధికారులు ఇవ్వడం లేదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే 104 కాల్‌ ‌సెంటర్‌ ‌ద్వారా అందుతున్న వైద్య సేవలు హాస్పిటల్స్ బెడ్ల వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఇందు కోసం హాస్పిటల్స్తో  సమన్వయం చేసుకోవాలని సబ్‌ ‌కలెక్టర్‌ ‌ధాన్యచంద్ర స్పష్టం చేశారు. హాస్పిటల్స్ ల్లో  చికిత్స కోసం వచ్చే కొరోనా  బాధితులకు టోకెన్లు రేజ్‌ ‌చేయాలన్నారు. పేషెంట్‌ ‌పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని హోం క్వారంటైన్‌కు సీసీసీకి ఆక్సిజన్‌ అవసరం, అవసరం లేని బెడ్ల వివరాలతో నివేదిక సిద్ధం చేయాలన్నారు. ప్రజలకు మరింత మెరుగైన కొవిడ్‌ ‌వైద్య చికిత్సను, సూచనలను, సలహాలను ఇచ్చేందుకు 24టూ7 మూడు షిప్టులలో అధికారులు పనిచేస్తున్నారన్నారు. ట్రై ఏజ్‌ ‌కేంద్రం డాక్టర్లు పేషెంట్లతో మాట్లాడి తగిన కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు.

Leave a Reply