Take a fresh look at your lifestyle.

సైబర్‌ ‌నేరస్తుల వలలో ప్రజలు

ఆన్‌ ‌లైన్‌ ‌మోసం నుండి మనల్ని మనం రక్షించుకొనుటకుగాను కనీస విషయాలు తెలిసి ఉండాలి. ఆన్‌లైన్‌లో షాపింగ్‌ ‌చేస్తున్నప్పుడు సెక్యూర్‌ ‌పేమెంట్‌ ‌గేట్‌వేస్‌ను ఎంచుకోవాలి. లేదంటే మన సమాచారం మూడో వ్యక్తికి చేరే ప్రమాదం ఉన్నట్టే. మీ పాస్‌వర్డ్‌లు, పిన్‌ ‌నంబర్లు, క్రెడిట్‌, ‌డెబిట్‌కార్డుల నంబర్లు, సీవీవీ నంబర్లు భద్రంగా ఉంచుకోవాలి. మీ బ్యాంకు ఖాతాల వివరాలు..క్రెడిట్‌, ‌డెబిట్‌కార్డుల నంబర్లు సహా ఇతర వివరాలు ఎప్పుడూ మీ ల్యాప్‌టాప్స్, ‌డెస్క్‌టాప్స్, ‌వెబ్‌సైట్స్‌లో సేవ్‌ ‌చేసి పెట్టుకోవద్దు.మీకు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే ఈ మెయిల్స్‌లోని అటాచ్‌మెంట్లు, ఫైళ్లపై ఎట్టిపరిస్థితుల్లో క్లిక్‌ ‌చేయవద్దు. వాటితో మీ కంప్యూటర్‌లోకి ఫిషింగ్‌ ‌లింక్‌లు వచ్చే ప్రమాదం ఉంది.

(ఆన్‌ ‌లైన్‌ ‌మోసాలపై అప్రమత్తత అవసరం)

మనం వాడే స్మార్ట్‌ఫోన్‌, ‌ల్యాప్‌టాప్‌, ‌డెస్క్‌టాప్‌, ‌చార్జింగ్‌ ‌కేబుల్‌ ‌డివైజ్‌ ఏదైనా సరే మనల్ని ఏమార్చి కొల్లగొట్టేందుకు సైబర్‌ ‌నేరగాళ్లు ప్రతిచోటా మాటు వేసి ఉంటున్నారు. వీరు చేసే మోసాల గురించి అవగాహన కలిగి ఉండటం, తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారానే వారికి అడ్డుకట్ట వేయగలమని రిజర్వు బ్యాంక్‌ అధికారులు అంటున్నారు. నేటి ఆధునిక జీవనశైలిలో ఆన్‌లైన్‌ ‌షాపింగ్‌, ఆన్లైన్‌ ‌డబ్బు చెల్లింపులు అతి సర్వ సాధారణం. డబ్బులు అవసరం లేకుండానే మొబైల్‌ ‌ఫోన్‌ ‌చేతిలో ఉంటే ఏ విధమైన చెల్లింపులైనా చేసే వెసులుబాటు ఉంది. కిలాడి కేటుగాళ్లు(హ్యాకర్లు) మనం మన మొబైల్‌ ‌వాడకంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా డబ్బులు కొల్లగొట్టేస్తారు. మనం చేసే ఏ చిన్న పొరపాటైనా సైబర్‌ ‌నేరగాళ్ళకు వరంగా మారుతుంది.    కాబట్టిచాలా చాలా జాగ్రత్తగా ఉండాలి.పాస్‌వర్డ్‌లు బలంగా పెట్టుకోకపోయినా, వారి మాయమాటలకు పడిపోయినా ఖాతాల్లో ఉన్నదంతా ఊడ్చి పెట్టుకుపోతుందని హెచ్చరిస్తున్నారు. మన అలసత్వం, అమయాకత్వాన్నే ఆసరాగా చేసుకొని కూర్చున్నచోటి నుంచే కోట్ల రూపాయలు కొల్లగొడుగున్నారు సైబర్‌ ‌నేరగాళ్లు. వీరి బారి నుంచి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు సూచిస్తూ ఆర్బీఐ నివేదికను విడుదల చేసింది.

ఆన్‌ ‌లైన్‌ ‌మోసం నుండి మనల్ని మనం రక్షించుకొనుటకుగాను కనీస విషయాలు తెలిసి ఉండాలి.
ఆన్‌లైన్‌లో షాపింగ్‌ ‌చేస్తున్నప్పుడు సెక్యూర్‌ ‌పేమెంట్‌ ‌గేట్‌వేస్‌ను ఎంచుకోవాలి. లేదంటే మన సమాచారం మూడో వ్యక్తికి చేరే ప్రమాదం ఉన్నట్టే. మీ పాస్‌వర్డ్‌లు, పిన్‌ ‌నంబర్లు, క్రెడిట్‌, ‌డెబిట్‌కార్డుల నంబర్లు, సీవీవీ నంబర్లు భద్రంగా ఉంచుకోవాలి. మీ బ్యాంకు ఖాతాల వివరాలు..క్రెడిట్‌, ‌డెబిట్‌కార్డుల నంబర్లు సహా ఇతర వివరాలు ఎప్పుడూ మీ ల్యాప్‌టాప్స్, ‌డెస్క్‌టాప్స్, ‌వెబ్‌సైట్స్‌లో సేవ్‌ ‌చేసి పెట్టుకోవద్దు.మీకు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే ఈ మెయిల్స్‌లోని అటాచ్‌మెంట్లు, ఫైళ్లపై ఎట్టిపరిస్థితుల్లో క్లిక్‌ ‌చేయవద్దు. వాటితో మీ కంప్యూటర్‌లోకి ఫిషింగ్‌ ‌లింక్‌లు వచ్చే ప్రమాదం ఉంది. కొత్తవారితో మీ చెక్‌బుక్‌ ‌కాపీలు, కేవైసీ డాక్యుమెంట్లు షేర్‌ ‌చేయవద్దు.

డివైజ్‌ ‌లేదా కంప్యూటర్‌ ‌సెక్యురిటీ ఇలా..
తరచూ మీ పాస్‌వర్డ్‌లు మారుస్తూ ఉండాలి.మీ డివైజ్‌ల్లో మంచి యాంటీ వైరస్‌ ‌సాఫ్ట్‌వేర్‌లు ఇన్‌స్టాల్‌ ‌చేసుకోవడంతోపాటు తరచూ డివైజ్‌లను అప్‌డేట్‌ ‌చేసుకోవాలి.మీ కంప్యూటర్‌, ‌ల్యాప్‌టాప్‌, ‌స్మార్ట్‌ఫోన్లకు తప్పక పాస్‌వర్డ్ ‌పెట్టుకోవాలి. మనకు తెలియని సోర్స్‌ల నుంచి యాప్స్‌ను డౌన్‌లోడ్‌ ‌చేయవద్దు.

మోసపోతే వెంటనే ఫిర్యాదు చేయాలి..
మనం సైబర్‌ ‌నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన వెంటనే సైబర్‌ ‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలి.అదేవిధంగా 24 గంటలపాటు పనిచేసే సైబర్‌‌క్రైం హెల్ప్‌లైన్‌ ‌నంబర్‌ 155260‌కు ఫిర్యాదు చేయవచ్చు. మన తెలుగు రాష్ట్రాలతో సహా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ హెల్ప్‌లైన్‌ ‌సేవలు ఉంటాయి. మనం కాల్‌ ‌చేసిన వెంటనే పోలీసులు మన బ్యాంక్‌ ‌ఖాతాను స్తంభింపజేస్తారు. దీనివల్ల మరింత సొమ్ము మనఖాతా నుంచి పోకుండా కాపాడుకోవచ్చు. తర్వాత కేసు దర్యాప్తు ఉంటుంది. ఇంటర్నెట్‌ ‌బ్యాంకింగ్‌లో క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంటర్నెట్‌ ‌బ్యాంకింగ్‌ ‌చేస్తున్నప్పుడు ఎల్లప్పుడు వర్చువల్‌ ‌కీబోర్డు (కంప్యూటర్‌ ‌స్క్రీన్‌పైన కీబోర్డు కనిపిస్తుంది)ను వాడాలి. సాధారణ కీబోర్డుపై మనం ఏయే నంబర్లు నొక్కామన్నది ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంటుంది.. మీరు ఇంటర్నెట్‌ ‌బ్యాంకింగ్‌ ‌చేసిన వెంటనే లాగ్‌అవుట్‌ ‌కావాలి.
తరచూ మీ పాస్‌వర్డ్‌ను మారుస్తూ ఉండాలి. ఇంటర్నెట్‌ ‌బ్యాంకింగ్‌కు..మీ ఈమెయిల్‌కు ఒకే పాస్‌వర్డ్‌ను ఎట్టి పరిస్థితుల్లో పెట్టకోవద్దు. సైబర్‌ ‌కేఫ్‌లు, ఇతర పబ్లిక్‌ ‌కంప్యూటర్లలో ఇంటర్నెట్‌ ‌బ్యాంకింగ్‌ ‌చేయకపోవడం ఉత్తమం.

పాస్‌వర్డ్ ‌పక్కాగా ఉండేలా చూసుకోవాలి..
మీ పాస్‌వర్డ్ ‌మీ ఆన్‌లైన్‌ ‌బ్యాంకు ఖాతాలకు, సోషల్‌ ‌మీడియా ఖాతాలకు తాళం వంటిది. ఇది పక్కాగా ఉండేలా చూసుకోవాలి. అవకాశం ఉన్న ప్రతి చోటా టూ ఫ్యాక్టర్‌(‌రెండంచెల సెక్యూరిటీ) ఆథంటికేషన్‌ ‌పెట్టుకోవాలి.

 ఫోన్‌ ‌హ్యాకింగ్‌ ‌మార్గాలివే.. జాగ్రత్త

 ఫేక్‌ ‌యాప్స్
‌సైబర్‌ ‌క్రైమినల్స్, ‌హ్యాకర్లు స్పైవేర్‌ను టార్గెట్‌ ‌చేసిన ఫోన్లలో ప్రవేశపెట్టేందుకు చాలా ఈజీ మార్గం ఫేక్‌ ‌యాప్స్. ‌మామూలుగా స్మార్ట్‌ఫోన్ల యూజర్లకు అవసరమైన యాప్స్‌ను పోలినట్టుగానే ఉండే నకిలీ యాప్స్ ‌ప్లే స్టోర్‌లో పెడతారు. వాటిలో వాస్తవానికి అసలైన యాప్‌ ఉం‌డదు. మనం తెలియక ఆ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ ‌చేశామంటే ఆటోమేటిక్‌గా ఫోన్‌ ‌హ్యాక్‌ అయిపోతుంది. సోషల్‌ ‌మీడియాలో, కొన్ని రకాల వెబ్‌సైట్లలో, పోర్న్ ‌సైట్లలో కూడా ఈ ఫేక్‌ ‌యాప్స్‌కు సంబంధించిన లింక్‌ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పొరబాటున కూడా వాటిని క్లిక్‌ ‌చేయకూడదు. అలాగే కొత్త యాప్స్ ‌డౌన్‌లోడ్‌ ‌చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్‌ ‌చేసుకోవడం మంచిది.

వాట్సాప్‌, ఈ-‌మెయిల్‌, ఎస్‌ఎంఎస్‌
‌వాట్సాప్‌, ఈ-‌మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌ ‌ద్వారా కూడా హ్యాకర్లు స్పైవేర్‌ ‌లింకులు పంపుతారు. లోన్లు ఇస్తామని, జాబ్‌ ఆఫర్‌ అని, సర్‌‌ప్రైజ్‌ ‌గిఫ్ట్ అని, లక్కీ డిప్‌ అని, ఫోన్‌కు కొత్త ఫీచర్స్ అని ఇలా రకరకాల ఫేక్‌ ‌లింక్స్ ‌క్రియేట్‌ ‌చేసి వాట్సాప్‌, ఈమెయిల్‌, ‌లేదా ఎస్‌ఎంఎస్‌ ‌ద్వారా పంపి, మీ ఫోన్‌ను హ్యాక్‌ ‌చేసే ముప్పు ఉంటుంది. పొరబాటున ఆ లింక్‌ను క్లిక్‌ ‌చేస్తే ఫోన్‌లో హ్యాకర్‌ ‌పంపిన వైరస్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది. దీంతో అది మన డేటాను మొత్తం హ్యాకర్‌కు పంపేస్తుంది. ఫోన్‌ ఆ ‌హ్యాకర్‌ ‌కంట్రోల్‌లోకి వెళ్లిపోతుంది. అందుకే అనవసరంగా పనికిరాని లింక్‌లు ఓపెన్‌ ‌చేయకుండా ఉంటే బెటర్‌.

 ‌సిమ్‌ ‌కార్డ్ ‌స్వాప్‌
‌మన పర్సనల్‌ ‌డేటా పొరబాటున హ్యాకర్లకు దొరికితే హ్యాకర్లు సిమ్‌ ‌కార్డు స్వాప్‌ ‌టెక్నిక్‌ ‌వాడుతారు. ఆ డేటా సాయంతో హ్యాకర్లు టెలికాం ఆపరేటర్‌కు కాల్‌ ‌చేసి సిమ్‌ ‌రిప్లేస్‌మెంట్‌ ‌కోసం డిమాండ్‌ ‌చేస్తారు. ఒకవేళ సిమ్‌ ఇష్యూ అయితే మన ఫోన్‌లో ఉన్న పాత సిమ్‌ ‌డీయాక్టివేట్‌ అవుతుంది. దీంతో ఇక హ్యాకర్‌కు మన ఫోన్‌ ‌నంబర్‌ ‌ఫుల్‌ ‌యాక్సిస్‌ ‌వచ్చేస్తుంది. దీంతో మన బ్యాంక్‌ ‌లావాదేవీలు, ఓటీపీలు అన్నీ ఆ ఫోన్‌కే వెళ్తాయి. అయితే ప్రస్తుతం సిమ్‌ ‌తీసుకోవాలంటే ఆధార్‌ ‌లింక్‌, ‌బయో మెట్రిక్‌ ‌తప్పనిసరి కావడంతో ఈ ప్రమాదం కొంత వరకు తగ్గుతుంది. కానీ సిమ్‌ ‌క్లోనింగ్‌ అనే మరో ప్రక్రియ ద్వారా మన సిమ్‌ ‌యాక్టివ్‌లో ఉండగానే, మన నంబర్‌తోనే ఇంకో సిమ్‌ ‌క్రియేట్‌ ‌చేసే టెక్నాలజీ కూడా వచ్చింది. ఇది ఇంకా డేంజర్‌. అం‌దుకే ఆధార్‌ ‌నంబర్‌ ‌లాంటి మన పర్సనల్‌ ‌డేటాను లీక్‌ ‌కాకుండా చూసుకోవాలి.

బ్లూటూత్‌ ‌హ్యాకింగ్‌
‌బ్లూటూత్‌ ‌సహాయంతో కూడా హ్యాకర్లు ఒక నిర్ణీత దూరంలో ఉన్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను హ్యాక్‌ ‌చేసే చాన్స్ ఉం‌ది. ఇందుకోసం హ్యాకర్లు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తారు. ఈ హ్యాకింగ్‌ ఎక్కువగా బహిరంగ ప్రదేశాల్లో జరుగుతుంది. పబ్లిక్‌ ‌వై-ఫైని వాడే వాళ్లు హ్యాకర్లకు ఈజీ టార్గెట్‌ అవుతారు. అందుకే పబ్లిక్‌ ‌వైఫైని వాడకపోవడం మంచిది. అలాగే మీ వైఫైని ఓపెన్‌గా వదిలేయకుండా ఉండాలి. కచ్చితంగా స్ట్రాంగ్‌ ‌పాస్‌వర్డ్ ‌పెట్టుకోవాలి.
సైబర్‌ ‌నేరాల గురించి సరైన అవగాహన పెంచుకుని ఎవరికి వారు రక్షించు కోవాల్సిన ఆవశ్యకత ఉంది.

పిన్నింటి బాలాజీ రావు ఉపాధ్యాయుడు
హనుమకొండ, 9866776286

Leave a Reply