Take a fresh look at your lifestyle.

చంద్రబాబు కుంటిసాకులను ప్రజలు నమ్మరు

పవన్‌ ‌కళ్యాణ్‌కు అనుభవం లేదని మంత్రి కొడాలి నాని వ్యాఖ్య
అమరావతి, ఏప్రిల్‌ 5 : ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. సోమవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ, రూరల్‌లో వైఎస్సార్‌సీపీ బలంగా ఉందనే చంద్రబాబు నాటకానికి తెరలేపారన్నారు. గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారం చేయాలని బాబు ఇంటర్నల్‌ ఆదేశాలిచ్చారన్నారు. మళ్లీ ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు కుంటిసాకులు చెబుతున్నారని కొడాలి నాని దుయ్యబట్టారు. పేమెంట్‌ ‌కోసం సొల్లు కబుర్లు చెప్పే వ్యక్తి పవన్‌ ‌కల్యాణ్‌. ఓటు హక్కు లేని పిల్లలతో సీఎం సీఎం అని పిలిపించుకునే వ్యక్తి పవన్‌. ‌జన సైనికులు.. జన సైకిల్‌గా మారారని‘ ఆయన ఎద్దేవా చేశారు. కుమారుడు లోకేష్‌ ‌మంగళగిరిలో ఓడిపోయినా చంద్రబాబు బుద్ధి రాలేదన్నారు. చంద్రబాబుకు డిపాజిట్లు కూడా వస్తాయో రావో చూసుకోవాలన్నారు. సీపీఎం, బీజేపీ నోటాతో పోటీ పడే పార్టీలంటూ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.ఇదిలావుంటే కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు మండలంలో వైసీపీ జడ్పీ చైర్మన్‌ అభ్యర్థి ఉప్పాల హారికతో కలిసి మంత్రి కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భావనతోనే ఎన్నికల బహిష్కరణ పేరుతో చంద్రబాబు కుంటి, గుడ్డి సాకులు చెబుతూ, నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. బహిష్కరణ పేరుతో టీడీపీ కుట్రపూరిత రాజకీయాలు చేసినా లేదా చంద్రబాబు, అతని పార్ట్‌నర్లు ప్రచారం చేసినా అంతిమ విజయం తమదేనన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ ‌రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలనతో నూటికి 70 శాతం ఓటింగ్‌ ‌వైసీపీకే అనుకూలంగా ఉందన్నారు. గుడ్లవల్లేరు జడ్పీటీసీగా 10 వేల ఓట్ల మెజార్టీతో ఉప్పాల హారిక గెలుస్తుందని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply