Take a fresh look at your lifestyle.

జిహెచ్‌ఎం‌సి ఎన్నికల వేళ గులాబీ పార్టీ నేతలపై .. జనం గుస్సా

వరద సాయం పార్టీ కార్యకర్తలకే ఇప్పిస్తున్నారని ఆగ్రహం
దిష్టిబొమ్మల దహనం, ఇళ్ల ఎదుట బైఠాయింపు

జీహెచ్‌ఎం‌సిలో వరద బాధితులకు ఆర్థిక సాయం వ్యవహారం అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. భారీ వర్షాలకు ఇళ్లు, వస్తువులు నష్టపోయిన వారికి ప్రకటించిన నష్ట పరిహారం అదజేసే విషయంలో ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై హైదరాబాద్‌ ‌నగవవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇవి కొన్ని చోట్ల కార్పొరేటర్ల దిష్టిబొమ్మల దగ్దం, వారి ఇళ్ల ఎదుట బైఠాయించి నిరసన తెలపడం వరకు వెళ్లింది. ఇటీవల  కురిసిన భారీ వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందలాది కాలనీలు నీట మునిగి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మరికొంత మంది ఇళ్లు కోల్పోవడం, కార్లు, బైకులు, ఎలక్ట్రానిక్‌ ‌పరికరాలు వంటివిలువైన వస్తు సామాగ్రి కోల్పోవడంతో వీరిని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలైన పాతబస్తీలోని మూసీ పరివాహక ప్రాంతా)తో పాటు లోతట్టు ప్రాంతాలైన కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్‌, ‌రామంతాపూర్‌, ‌గుడిమల్కాపూర్‌ ‌ప్రాంతాలలో భారీ ఎత్తున ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ అభయ హస్తం పేరిట రూ.10 వేలు నష్టపరిహారంగా చెల్లిస్తామని సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించారు.

అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసే బాధ్యతను రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులకు అప్పగించారు. ఈ అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి ఆధార్‌ ‌కార్డు ఆధారంగా సమగ్ర సర్వే నిర్వహించి ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సాయంతో బాధిత కుటుంబాలకు వరద సాయం అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక సూచించింది. అయితే, జీహెచ్‌ఎం‌సి పరిధిలోని చాలా ప్రాంతాలలో అధికార పార్టీ నేతలు తమకు ఇష్టం వచ్చిన రీతిలో వరద సాయాన్ని పంచుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద సాయం అందించడానికి అసలైన లబ్దిదారులను గుర్తించడకుండా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకే అందజేస్తున్నారని విమర్శిస్తున్నారు. శుక్రవారం గుడిమల్కాపూర్‌ ‌డివిజన్‌లో వరద బాధితులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం వరదల కారణంగా సర్వం నష్టపోయిన తమకు కాకుండా కొర్పొరేటర్‌ ‌చెప్పిన వారికి మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. గుడిమల్కాపూర్‌ ‌కార్పొరేటర్‌ ‌బంగారు ప్రకాశ్‌ ‌వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసే విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేవలం టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు, తమ అనుచరులకే ఇప్పించుకుంటున్నారని ఆరోపిస్తూ గుడిమల్కాపూర్‌లో ఆయన దిష్టిబొమ్మను దగ్గం చేశారు. బంగారు ప్రకాశ్‌ ‌డౌన్‌డౌన్‌ అం‌టూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వరదలలో అన్ని కొల్పోయిన తమను గాలికి వొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి డివిజన్లలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడి ఎమ్మెల్యే, కార్పొరేటర్లు అధికారులు తమకు చెందిన వారితో జాబితాను తయారు చేయించి కేవలం వారికే వరద సాయం అందజేస్తున్నారని ఆరోపిస్తూ ఆయా కార్పొరేటర్ల ఇంటిముందు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక ఉప్పల్‌, ‌రామంతాపూర్‌ ‌ప్రాంతా)కు ఇప్పటికీ వరదల కారణంగా నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందించడానికి  అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఇప్పటికీ వివరాల సేకరణకు రాకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యర్తం చేస్తున్నారు. వరద సాయం కోసం ఇంకా ఎన్ని రోజులు వేచి ఉండాలని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, నగరంలో భారీ వర్షాలకు నీటి మునిగిన కాలనీలు ఇంకా తేరుకోలేదు. ఇంకా కాలనీల్లో నీరు నిలిచి ఉండటంతో పాటు నీటిలో కొట్టుకుపోయిన వస్తువులు, సామాగ్రి కూడా ఇంకా నీటిలోనే ఉండటంపై నిరాశ్రయులు స్థానిక ప్రజా ప్రతినిధుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వోట్ల సమయం రాగానే వరుసబెట్టి వచ్చే ప్రజాప్రతినిధులు, నేతలు ఇప్పుడు కనీసం తమ వంకైనా చూడటం లేదని విమర్శిస్తున్నారు. అన్నీ కోల్పోయిన తమకు ఆర్థిక సాయం మాట అటుంచితే కనీసం ఇప్పటికీ తమకు నిత్యావసర సరుకులు కూడా అందడం లేదనీ, ఈ పరిస్థితికి అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులే బాధ్యత వహించాలని స్పష్టం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో వోట్లు అడగానికి వచ్చినప్పుడు వారికి దీటైన సమాధానం చెబుతామని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రభుత్వం వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం వ్యవహారం వచ్చే జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో తమ గెలుపుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని అధికార పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply