పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి: మంత్రి హరీష్ రావు సమీక్ష

ప్రజాతంత్ర, సంగారెడ్డి: జహీరాబాద్ మున్సిపల్‌లో కొనసాగుతున్న పెండింగ్ పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ శాఖల అధికారులతో చర్చించారు అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని లేదంటే , కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్మశానవాటికలో పనులు రోడ్డు పనులు మురుగు కాల్వల పనులు రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. మున్సిపల్ కు మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని లేదంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జహీరాబాద్ మార్కెట్ యాడ్ పనులను త్వరగా ప్రారంభించాలని ఇప్పుడున్న వ్యాపారస్తులు వేరే చోటుకు మార్చాలని దీనికి అవసరమైతే పోలీసు సహకారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేట తరహాలో జైరాబాద్ ను అభివృద్ధి చేయాలని అన్నారు.
గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను మంత్రి ఆదేశించారు. మిషన్ భగీరథ పనులను త్వరితగతిన పూర్తి చేసి ఇంటికి నల్ల కనెక్షన్ అందించాలని ఆదేశించారు. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇంటింటికి చెత్త బుట్టలను పంపిణీ చేయాలని తెలిపారు. జహీరాబాద్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పనులను పూర్తి చేసి నిరుపేదలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జహీరాబాద్‌లో నిర్మిస్తున్న రోడ్ వైన్డింగ్ పనులు స్ట్రీట్ లైట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. మున్సిపల్‌కు రావాల్సిన బకాయిలను తొందర తొందరగా వసూలు చేయాలని అన్నారు. మున్సిపల్ పనులపై ప్రతి నెల రివ్యూ నిర్వహించాలని ఆర్డీఓను ఆదేశించారు. మున్సిపల్ ఆదాయం పెంచి అభివృద్ధికి సహకరించాలని అన్నారు. జర్నలిస్ట్ కాలనీని ఆయన సందర్శించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే కె.మానిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీరుద్దీన్, సీడీసి ఛైర్మన్ ఉమాకాంత్ పాటిల్, సినీ నిర్మాత మల్కాపురం శివకుమార్, మున్సిపల్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Tags: Kemanik along minister Rao MLA, MLC phariruddin, sidisi Umakant Patil, chairman, filmmaker malkapuram Shivakumar, municipal