Take a fresh look at your lifestyle.

పెండింగ్‌ ‌బిల్లులు చెల్లించాలి

జాతీయ గ్రామీణ ఉపాధి హామి పని ప్రాంతాలలో సందర్శించిన బూర్గంపాడు మండల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంక•శ్వర్లు ఉపాధి కార్మికులు పని చేసిన కాని 6 వారాలు నుండి డబ్బుల బిల్లులు ఇవ్వడం లేదని తాము ఎర్రటి ఎండలో పనిచేసిన కనీస వేతనం 237 రూపాయలు కూడ ఇవ్వడం లేదని ఆరోపించారు. వంద లోపే కూలీ రాస్తున్నారని ఉపాధి కార్మికులు ఆవేదన వ్యక్తం చేసారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని  పనిప్రదేశంలో గడ్డపార , దెబ్బలు తగిలిన వారికి మెడికల్‌ ‌బిల్లులు వెంటనే చెల్లించాలని అన్నారు.

వారు ఎన్నిరోజులు ఇంట్లో ఉంటే అన్నీ రోజులు మష్టం కట్టించాలని డిమాండ్‌ ‌చేసారు. పని అడిగిన వారికి ఇవ్వాలని, కొలతలు లేకుండా మష్టం వేయాలని, పనిప్రదేశంలో మెడికల్‌ ‌కిట్‌లు ఇవ్వాలని, గడ్డ పలుగు, తట్టలు, మంచి నీళ్ళు టెంట్‌  ‌వేతనం ఇవన్నీ పొందుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి, తిరుతపయ్య, సొడే రాజు, పద్మ, నాగమణి, పాల్గొన్నారు.

Leave a Reply