ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకపోతే జరిమానాలు తప్పవని లక్షేట్పేట సిఐ నారాయణ్‌నాయక్ అన్నారు. బుధవారం రోజున మండలకేంద్రంలో జన్నారం,లక్షేట్పేట ఎస్సైలు వినోద్‌కుమార్,దత్తాద్రి పోలీస్‌సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మ్‌ట్ ధరించని వారి 64 మంది వాహనాలను పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న 10 ఆటోలను స్వాదీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే 1000 రూపాయలు జరిమానా విధిఞచబడునని నాణ్యమైన ఐఎస్సై మార్కు గల హెల్మెట్లను వాడితే ఎలాంటి ప్రమాదాలు జరగవని తెలిపారు. హెల్మెట్ ధరించకపోతే ఏమి జరుగుతుందో వారం రోజుల క్రితమే మండలంలోని ఇందన్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదమే నిదర్శనమని అన్నారు. పరిమితికి మించి ఆటో జీప్ వాహనాలలో ప్రయాణీకులను ఎక్కించవద్దని ముఖ్యంగా ఆటోలలో డ్రైవర్ ప్రక్కన ఉన్న సీట్లను తొలగించాలని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడుపకూడదని సరియైన పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జన్నారం,లక్షేట్పేట ఎస్సైలు వినోద్‌కుమార్,దత్తాద్రి,ఏఎస్