Take a fresh look at your lifestyle.

బహిరంగ ప్రదేశాల్లో పొగ త్రాగిన వారికి జరిమాన

ఎంజిఎం: బహిరంగ ప్రదేశాల్లో పొగ త్రాగిన 21 మందికి గురువారం రూ. 200లు చొప్పున జరిమాన విధించినట్లు అడీషన్‌ ‌డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ ‌మదన్‌మోహన్‌ ‌తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో సిగరేట్లు, బీడీలు కాల్చడం వల్ల పక్క వారికి కూడా ఊపిరితిత్తుల సంబంధిత రోగాలు వచేచ అవకాశం ఉన్నందున ప్రజలు బహిరంగంగా పొగ త్రాగడం మానుకోవలన్నారు.

ఇప్పటి వరకు అర్బన్‌ ‌జిల్లాలో 93 మందికి జరిమానా విధించామన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ ‌విల్సన్‌, ‌హెల్త్ ఎక్స్‌టెన్షన్‌ అధికారి నాగేంద్రబాబు, హెల్త్ ‌సూపర్‌వైజర్‌ ‌రామ్మోహన్‌, ‌హెల్త్ అసిస్టెంట్‌ ‌చారిలు పాల్గొన్నారు.

Leave a Reply