Take a fresh look at your lifestyle.

కలం – అక్షరం!

కలం..
అన్నార్తుల ఆకలి కేకలకు
అద్దం పట్టే సజీవ లేఖిని కావాలి
గుడిసెల్లో బడుగుల బాధల్ని
వినిపించే వేదనాస్వరం కావాలి
నిర్భాగ్యుల నిట్టూర్పుల గుట్టు
విప్పే నిర్నిద్ర నేత్రం కావాలి
అక్షరం..
కలం హలం చేసే కవితా సాగులో
విస్తారంగా మొలకెత్తి విశ్వమంతా
వెల్లివిరిసే విత్తనమై మెరవాలి
పేదోడి కతను పఠితల మనసుల
కతికేలా ఏర్చి కూర్చి సార్ధక్యం
పొందాలి..
అక్షరం..కలం కాడికి జోడెడ్లలా
కలకాలం కరుణాత్మకంగా కలసి
సాగుతూ కవనసేద్యం చేయాలి
ధ్యంస జీవితాల చరిత్రను గ్రంథస్తం
చేసి వారి జీవితాల్లో కాంతిరేకలు
పూయించే పవిత్ర యజ్ఞంలో ఆరని
సమిధలై జ్యలించాలి.. కష్టజీవుల
కాలిముద్రల వెంటే పయనిస్తూ ఆ
రుధిరార్ణవ పాదాలు కందకుండా
అక్షర పాదరక్షలై నిత్యం నిల్చిపోవాలి!

భీమవరపు పురుషోత్తం
9949800253

Leave a Reply