Take a fresh look at your lifestyle.

పెగాసస్‌ ‌స్నూపింగ్‌.. ‌ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రయత్నం

  • జాతీయ భద్రతపై ప్రభుత్వం దాడి
  • స్వప్రయోజనాలకు పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం చట్ట విరుద్ధం: కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ

మన ఎన్నికల సంఘం, ప్రతిపక్ష నేతలు, ముఖ్యమంత్రుల డేటాను భారతదేశం బయటికి వెళ్లినట్లయితే దాంతో వారు దేశ భద్రతపై దాడి చేస్తున్నారని కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ అన్నారు. కొంతమంది వ్యక్తులపై నిఘా కోసం ఇజ్రాయెలీ స్పైవేర్‌ ‌పెగాసస్‌ను ఉపయోగించారనే ఆరోపణలపై విచారణకు సుప్రీమ్‌ ‌కోర్టు ముగ్గురు సభ్యుల సైబర్‌ ‌నిపుణుల ప్యానెల్‌ను నియమించడం పెద్ద ముందడుగని బుధవారం ఆయన అభిప్రాయపడ్డారు దీంతో వాస్తవాలు బహిర్గతమవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. పెగాసస్‌ని ఉపయోగించి స్నూపింగ్‌ ‌చేయడం భారత ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రయత్నమని ఆయన నొక్కిచెప్పారు. సుప్రీమ్‌ ‌కోర్టు ఈ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పడం చాలా కీలక నిర్ణయమని, దాంతో వాస్తవాలు బయటకొస్తాయని తాము విశ్వసిస్తున్నామని అన్నారు. పెగాసస్‌ ‌స్పైవేర్‌ను ప్రధానమంత్రి లేదా హోంమంత్రి ఆదేశించారని, ప్రధానమంత్రి అలా చేసి ఉంటే ఎందుకు చట్టవిరుద్ధమైన చర్యలు చేపడుత్తున్నారో తాము తెలుసుకోవాలనుకుంటున్నామని ఆయన అన్నారు.

భారతదేశంలో ఇలా స్పైవేర్‌ను ఉపయోగించడం చట్టవిరుద్ధమని, ప్రధాని చట్టానికి అతీతుడు కాదని రాహుల్‌ ‌స్పష్టం చేశారు. ‘పెగాసస్‌కు ఎవరు అధికారం ఇచ్చారు, ఏ ఏజెన్సీకి అధికారం ఇచ్చారు, పెగాసస్‌ను ఒక ప్రైవేట్‌ ‌వ్యక్తి కొనుగోలు చేయలేరని మనందరికీ తెలుసు, దానిని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఎవరికి వ్యతిరేకంగా ఉపయోగించబడింది. మన ప్రజల సమాచారాన్ని మరేదైనా ఇతర దేశానికి యాక్సెస్‌ ‌చేసిందా’ అని రాహుల్‌ ‌గాంధీ ఈ సందర్భంగా ప్రశ్నలు సంధించారు. ‘ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌లేదా ప్రతిపక్ష నేతల డేటా ప్రధానమంత్రికి వెళితే అది నేరపూరిత చర్య. మీరు ఉగ్రవాదాన్ని ఎదుర్కునడానికి దీనిని ఉపయోగిస్తున్నారంటే, అది వేరే విషయం. కానీ ప్రధాని వ్యక్తిగత ఉపయోగం కోసం డేటాను ఉపయోగించడం పూర్తిగా నేరపూరితమైన విషయం’’ అని రాహుల్‌ ‌గాంధీ అన్నారు. ఈ విధంగా చట్ట వ్యతిరేక చర్యలు చేపట్టిన ప్రభుత్వాలు తొలగించబడ్డాయని, అందుకు ఉదాహరణగా కర్నాటక ఉదంతాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం జాతీయ భద్రతపై దాడి చేస్తుందని, మన ఎన్నికల సంఘం, ప్రతిపక్ష నాయకులు లేదా ముఖ్యమంత్రుల డేటాను భారతదేశం బయటికి వెళ్లినట్లయితే దాంతో జాతీయ భద్రతపై దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. ఇది రాజకీయ అంశం కాదని, అస్తిత్వానికి సంబంధించిన అంశమని అన్నారు. ప్రతిపక్షాల గొంతు న్కొవేయబడడడానికి ఇదీ ఒక కారణమని ఆయన అన్నారు.

Leave a Reply