ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తా చాలు: పీతల సుజాత
ఏలూరు,డిసెంబర్2 : రాష్టాన్రికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును సాధించుకోవడానికి చంద్రబాబు చేసిన కృషి మరువలేనిదని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. అయితే ఇప్పుడూ స్ఫూర్తి కొరవడిందని, నిర్వాసితులను కూడా ఆదుకోలని దుస్తితి నెలకొందన్నారు. ఇకపోతే ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తయ్యేనొ కూడా తెలియడం లేదన్నారు. ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి వైసిపి ప్రభుత్వం చిత్తశుద్ది చాటుకోవాలని లేకుంటే ప్రజలు సహించరని అన్నారు. ముఖ్యంగా వైసిపి నేతలు విమర్శలు మాని ప్రాజెక్ట్ పూర్తయ్యేలా చూడాలని అన్నారు. లేకుంటే రాష్ట్ర ప్రజానీకం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. పోలవరం నిర్మాణం కోసం చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేసారని, ఇప్పటి వరకు అనేకసార్లు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారని, వర్చువల్ పరిశీలన చేశారని చెప్పారు.
అయితే నేటికీ ప్రాజెక్టను పూర్తి చేయాలేని వైసిపి నేతలు ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్న దశలో వైసిపి రాకతో రివర్స్ టెండర్ల పేరిట నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. అర్హతలేనివారి మాటలకు విలువ ఉండదన్నారు. అడ్డగోలు విభజనతో నష్టపోయిన రాష్టాన్న్రి ప్రగతి పథకంలో నిలపడానికి చంద్రబాబు కృషి చేస్తే…కొందరు స్వార్థపూరితంగా ఆయనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.