Take a fresh look at your lifestyle.

ప్రశాంతంగా ముగిసిన రైతుల చక్కాజామ్‌

  • ఎక్కడిక్కడ రోడ్లను దిగ్బంధించిన రైతులు
  • పలుచోట్ల ధర్నాలతో ఆందోళనలకు దిగిన నేతలు
  • అరెస్ట్ ‌చేసిన పోలీసులు…భారీ భద్రత ఏర్పాటు

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా దేశవ్యాప్తంగా రైతు సంఘాల పిలుపు మేరకు చక్కా జామ్‌ ‌నిర్వహించారు. ఎక్కడిక్కడే జాతీయ రహదారుల దిగ్బంధనంతో పాలు చోట్ల వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. రైతలకు మద్దతుగా అనేక రాష్ట్రాల్లో లెఫ్ట్ ‌తదితర పార్టీల సంఘాలు,నేతలు పాల్గొన్నారు. రహదారులను దిగ్బంధించారు. దేశంలోని అన్ని ప్రధాన రహదారులపై రైతులు, కార్మికులు,వివిధ ప్రజాసంఘాల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి దిగ్బంధనం చేశారు. పంజాబ్‌, ‌హర్యానా, పశ్చిమబెంగాల్‌,‌కేరళ, ఉత్తరప్రదేశ్‌, ‌రాజస్తాన్‌, ‌మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో జాతీయరహదారులు స్తంభించిపోయాయి.

ఇందులో భాగంగా విశాఖలోని మద్దిలపాలెం కూడలి వద్ద సిఐటియు, ఎఐటియుసి, ఎఐఎఫ్‌టియు, ఐఎఫ్‌టియు, ఎస్‌యుసిఐ, పిఎఫ్‌టియుఐ, పిఒడబ్ల్యూ నాయకులు,కార్యకర్తలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అలాగే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించ వద్దని డిమాండ్‌ ‌చేశారు. బిజెపి విధానాలను వ్యతిరేకించారు. ఇందులోభాగంగానే గాంగారావు, కుమార్‌, ‌జగ్గునాయుడు, సహా పలువురు నాయకులను అరెస్టు చేశారు. అన్నదాతలు తలపెట్టిన చక్కా జామ్‌తో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో చక్కా జామ్‌ ‌నిర్వహించడం లేదని రైతులు చెప్పినప్పటికీ పోలీసులు భారీగా మోహరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని పలు మెట్రో రైల్వేస్టేషన్లను మూసివేశారు. లాక్‌ ‌ఖిల్లా, జామా మసీద్‌, ‌జన్‌పథ్‌, ‌సెంట్రల్‌ ‌సెక్రటేరియట్‌, ‌విశ్వవిద్యాలయ స్టేషన్‌, ‌మండీ హౌస్‌, ఐటీవో, ఢిల్లీ గేట్‌ ‌స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్‌ ‌గేట్లను మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్‌ ‌కార్పొరేషన్‌ ‌స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇకపోతే కొత్త సాగు చట్టాల రద్దు ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా అన్నదాతలు చేపట్టిన చక్కా జామ్‌ ‌కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.

పలు ప్రధాన నగరాల్లో రైతు ఉద్యమ మద్దతుదారులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. బెంగళూరు, పుణె, దిల్లీలో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెలలకు పైగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన సాగిస్తున్న రైతులు తమ పోరాటంలో భాగంగా చక్కా జామ్‌కు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సాగిన ఈ రాస్తారోకో కార్యక్రమంలో పలు ప్రధాన నగరాల్లో రైతు ఉద్యమకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. పంజాబ్‌, ‌హరియాణా రాష్ట్రాల్లో పలు చోట్ల రైతులు జాతీయ రహదారులను దిగ్బంధించారు. బెంగళూరులోని యలహంక పోలీస్‌ ‌స్టేషన్‌ ‌బయట ఆందోళన చేస్తున్న రైతు మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిల్లీలోని షాహీదీ పార్క్ ‌వద్ద రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వదిలేశారు. చక్కాజామ్‌ ‌దృష్ట్యా దిల్లీ-యూపీ సరిహద్దులోని గాజీపుర్‌ ‌వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 50వేల మంది పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది పహారా కాస్తున్నారు. అటు సింఘు, టిక్రీ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. డ్రోన్ల ద్వారా భద్రతను పర్యవేక్షించారు. ముందు జాగ్రత్త చర్యగా దిల్లీలోని పలు ప్రధాన మెట్రో స్టేషన్లను మూడు గంటల పాటు మూసివేశారు. హర్యానా,పంజాబ్‌లలో ప్రభావం తీవ్రంగా ఉంది. ఎపిలోని పలుప్రాంతాలు, బెంగాల్‌, ‌కేరళలలో కూడా ప్రభావం చూపింది.

Leave a Reply