Take a fresh look at your lifestyle.

పేదలకందే పిడిఎఫ్‌ ‌బియ్యం పెద్దలపాలు

ప్రభుత్వ ఉద్యోగులకు ఎఫ్‌ఎస్‌సీ కార్డులు : చర్యలు తప్పవని రెవెన్యూ అధికారుల హెచ్చరిక
: అవినీతి లంచగొండి తనాన్ని రూపు మాపేందుకు నీతివంతమైన పాలన అందించేందుకే ప్రజాసేవలోకొచ్చానని అవినీతిపై డేగకన్ను ఉంటుందని అక్కన్నపేట మండలం చౌటపల్లి సర్పంచ్‌ ‌గద్దల రమేశ్‌ అన్నారు. సదరు గ్రామంలో వివిధ శాఖల్లో వివిధ హోదాలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారనే అభియోగంపై రెవెన్యూ అధికారులు చౌటపల్లిలో విచారణ చేపట్టారు.ఓ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగితో పాటు మరో రెండు ఎఫ్‌ఎస్‌సీ కార్డులు కలిగి ఉన్నారని విచారణలో తేలిందని,ఈ విశయాన్ని తమ దృష్టికి తీసుకురాని రేషన్‌డీలర్‌ ‌కు మెమో జారీ చేశామని రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ ‌గడ్డం సురేందర్‌,‌వీఆర్‌వో మాచమల్ల మల్లేశం వెల్లడించారు. దీనిపై సదరు గ్రామపంచాయితీ సర్పంచ్‌ ‌రమేశ్‌ ‌ఘాటుగా స్పందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క కుటుంబంలోనే మూడు కార్డులుండడం విస్మయాన్ని కలిగించిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇంకా ఇలాంటి వారున్నారన్నారు.పేదల కోసం ప్రభుత్వం చౌకగా ఇస్తున్న పీడీఎఫ్‌ ‌రైస్‌ ‌పెద్దలపాలవుతోందని, అధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు చేపట్టాలని రమేశ్‌ ‌కోరారు.

డీలర్లు….భాగస్వామ్యులేనా
ఆయా గ్రామాల్లో ప్రతినెల ప్రభుత్వం సరఫరా చేస్తున్న రూపాయికి కిలో బియ్యం పేదలకందడంలేదనే చెప్పవచ్చు. భూస్వాములు ఉన్నతోద్యోగం చేస్తున్న వారే ప్రతీనెల పొందుతున్నారు.ఇలాంటి వారి బియ్యాన్ని వేలిముద్ర పెట్టించుకున్న డీలర్లు కిలో బియ్యానికి 5 నుంచి 10రూపాయలకు కొనుగోలు చేసి అదే బియ్యాన్ని 12 నుంచి18 రూపాయలకు బయటి వ్యాపారులకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న దాఖలాలున్నాయి.ఇటీవల హుస్నాబాదు పట్టణానికి చెందిన కొంతమంది వ్యాపారులు ఈ పీడీఎఫ్‌ ‌బియ్యం ఆలయాల్లో కొన్నామని చెప్పేందుకు పసుపు కుంకుమ కలిపి నిల్వ చేసి ఇతర ప్రాంతాలకు తరలించడం మామూలైంది.

అక్రమంగా పొందిన కార్డులు ఏరివేస్తాం : తహశీల్ధార్‌
అక్కన్నపేట మండలంలో ఉన్న 32 గ్రామపంచాయితీలకు గాను 12,645 ఫుడ్‌సెక్యూరిటీ కార్డులున్నాయని వీటికి 37190 యూనిట్ల బియ్యం సరఫరా అవుతున్నాయని తహశీల్ధార్‌ ఎస్‌.‌వేణుగోపాల్‌రావు తెలిపారు. పైన పేర్కొన్న కార్డుల్లో గ్రామానికో 8 నుంచి 10 కార్డులు అక్రమంగా పొంది ఉన్నారని వాటిని ఇప్పటికే గుర్తించామన్నారు.వెంటనే రద్దు చేసి పేదలకందే రూపాయికి కిలో బియ్యాన్ని ఇన్నాళ్లు అక్రమంగా పొందిన వాటిని రీకవరీ చేస్తామన్నారు.ఎవరైనా ఉద్యోగులు,భూస్వాములు,వ్యాపారులు అక్రమంగా పొంది ఉన్న ఎఫ్‌ఎస్‌సీ కార్డులు తమకు అప్పగించాలని,లేదంటే క్రిమినల్‌ ‌కేసులు నమోదు చేయాల్సివస్తోందని హెచ్చరించారు.కాగా ఇన్నాళ్లు సదరు అక్రమంగా రేషను కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు తెలుపకపోగా బియ్యం ఇచ్చిన రేషను డీలర్లపై చర్యలు తీసుకుంటామని తహశీల్ధార్‌ ‌వేణుగోపాల్‌రావు స్పష్టం చేశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!