Take a fresh look at your lifestyle.

మద్దతు ధరకు మక్కలు కొనడం రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యత

సిఎం కెసిఆర్‌కు పీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌పొన్నం ప్రభాకర్‌ ‌బహిరంగ లేఖ 

తెలంగాణ రాష్ట్రం సీఎం కెసిఆర్‌  ‌సొంత జాగీరు కాదని టీపీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌పొన్నం ప్రభాకర్‌ ‌మండిపడ్డారు. సర్కార్‌ ‌వేసుకోమన్న పంట వేసుకోవాలని, వద్దన్న పంట పండించకూడదంటూ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పొన్నం ప్రభాకర్‌ ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌కి బహిరంగ లేఖ రాశారు.
ఈ లేఖలో ప్రజ భారతదేశంలో అనేకమైన శిక్షాస్మృతుల లోపల ప్రజలకు స్వేచ్ఛ, హక్కులు కల్పించబడ్డాయని అన్నారు. రైతులు కొత్తగా గొంతెమ్మ కోరికలను కోరడం లేదని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి 2020 సంవత్సరం కనీస మద్దతు ధరల ప్రకారంగా మొక్క జొన్నలు క్వింటాలుకు 1850 రూపాయలకు కొనే కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అనేక సందర్భాలలో చేసిన అనేక ప్రకటనలను పొన్నం జ్ఞాపకం చేశారు.

Leave a Reply