Take a fresh look at your lifestyle.

‘‌సుప్రీమ్‌’ ‌తీర్పుతో ఏకీభవించం:పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌వెల్లడి

  • ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అంశంపై
    పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌వెల్లడి
  • ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్‌ ‌దీక్ష
ఎస్సి, ఎస్టీ రిజర్వేషన్‌ ‌హక్కు కాదని సుప్రీమ్‌ ఇచ్చిన తీర్పు ను కాంగ్రెస్‌ ‌పార్టీ ఏకీభవించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు.కాంగ్రెస్‌ ‌మూల సిద్ధాంతమే సామాజిక న్యాయమన్నారు. సోమవారం ఎస్సి, ఎస్టీ,బీసీ, మైనారిటీ  రిజర్వేషన్ల పై బీజేపీ,టీఆరెస్‌ ‌ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఇందిరా పార్క్ ‌లో కాంగ్రెస్‌ ‌దీక్ష చేసింది.ఈ ధర్నాలో పీసీసీ అధ్యక్షుడితో పాటు  రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ‌ఛార్జ్ ‌కుంతియా ,సిఎల్పీ నేత భట్టి విక్రమార్క  మాజీ మంత్రలు గీతారెడ్డి , షబ్బీర్‌ అలీ , చిన్నా రెడ్డి ,ఎమ్మెల్యే లు జగ్గారెడ్డి ,శ్రీధర్‌ ‌బాబు , మాజీ పీసీసీలు ,పొన్నాల లక్ష్మయ్య , హనుమంతరావు , మాజీ ఎమ్మెల్యే లు సంపత్‌ ‌కుమార్‌,‌వంశీ చాంద్‌ ‌రెడ్డి ,మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్‌ ,‌కొండా విశ్వేశ్వర్‌ ‌రెడ్డి ,ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి ,ఇతర కాంగ్రెస్‌ ‌నాయకులు ,కార్యకర్తలు  భారీగా తరలివచ్చారు.ఈ బిల్లు పై దళిత గిరిజన, మైనార్టీ వర్గాలు  ఆందోళన చెందుతున్నాయని ,ఆ వర్గాలకు భరోసా కల్పించడానికే ఈ నిరసన ధర్నా అని ఉత్తమ్‌ ‌తెలిపారు .ఇప్పుడు ఎన్నికలు లేవు, మేము ఓట్ల కోసం ఈ ధర్నా చేయడం లేదన్నారు .ఒక దళితుడు దామోదర సంజీవయ్య ను సీఎం చేసింది కాంగ్రెస్‌ అని    టీఆర్‌ఎస్‌ ‌లో ఇలాంటి అవకాశం ఉంటుందా అని ప్రశ్నించారు..?దళిత సీఎం అన్న కేసీఆర్‌ ‌తన కేబినెట్‌ ‌లో ఒక్క మాదిగకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తు చేశారు .
అసదుద్దీన్‌కు రేవంత్‌, ‌భట్టి సవాల్‌
‌దేశంలో మైనారిటీలు మా బ్రతుకు ఏంటి అంటూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఎంఐఎం ఎంపీ అస్సదుద్దిన్‌ ఒవైసీ ని సిఎల్పీ నేతా భట్టి విక్రమార్క ప్రశ్నించారు.మీరు నిజంగా మైనారిటీల క్షేమం కోరేవారు అయితే బయటకి రండి అని సవాల్‌ ‌విసిరారు.మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా పోరాటం చేద్దాము రండి అని కోరారు.రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసే విధంగా ప్రణాళికల్ని కాంగ్రెస్‌ ‌పార్టీ రచిస్తుందన్నారు .కాంగ్రెస్‌ ‌పార్టీ బలాన్ని తక్కువ అంచనా వేయడం ఎంఐఎం కి  పద్ధతి కాదని ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసదుద్దీన్‌ ‌మీ నాన్న గారికి మద్దతు ఇచ్చింది కాంగ్రెస్‌ ‌పార్టీ అని ఈ విషయం మరవద్దని ,కాంగ్రెస్‌ ‌పార్టీ తలుచుకుంటే మీ పరిస్థితి ఏంటో తెలుసుకోవలని అన్నారు.సుప్రీంకోర్టు తీర్పుతో రిజర్వేషన్లు ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందని , కేంద్రంలో రాష్ట్రంలో ప్రజలకి ఇచ్చిన హామిల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు.దేశంలో ప్రజలు రిజర్వేషన్ల లభ్ది పొందారు అంటే అది కాంగ్రెస్‌ ‌పార్టీ వల్లనే అన్నారు .మోడీ తన ఆమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి కొత్త చట్టాలు చేస్తున్నారని ఆరోపించారు .

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply