Take a fresh look at your lifestyle.

త్వరలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధుల నియామకం

  • రమణ, కౌశిక్‌ ‌రెడ్డిల విషయం ముందే తెలుసు
  • కాంగ్రెస్‌ ‌పార్టీలోకి వొచ్చేందుకు నేతల ఆసక్తి
  • కొండా విశ్వేశ్వర్‌ ‌రెడ్డిని కలుసుకున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి

రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికార ప్రతినిధులను నియమిస్తామని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు కాంగ్రెస్‌లో సమన్యాయం ఉంటుందని, ఎల్‌ ‌రమణకు నాలుగు సార్లు భోజనం పెట్టి.. కేసీఆర్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌లోకి తీసుకున్నారని రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. చాలా మంది ఇతర పార్టీల నేతలు టచ్‌ ‌లోకి వొస్తున్నారని, ముగ్గురు కీలక సామాజిక వర్గాలకు చెందిన నేతలు మంగళవారం తమ పార్టీలోకి వొచ్చారని రేవంత్‌ అన్నారు. కౌశిక్‌ ‌మాటలు కాదు.. కేసీఆర్‌ ‌మాట్లాడించిన మాటలు అని రేవంత్‌ ‌మండిపడ్డారు. హుజురాబాద్‌లోమా అభ్యర్థిని ఇప్పుడే చెప్పం..కానీ మంచి అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. తనకు కౌశిక్‌ ‌వ్యవహారం ముందే తెలుసని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నాడని తనకు సమాచారం ఉందని, అక్కడ కౌశిక్‌కు టీఆర్‌ఎస్‌ ‌టికెట్‌ ఇస్తారని అనుకోవడం లేదని రేవంత్‌ ‌పేర్కొన్నారు. టీఆరెస్‌ ‌ప్రచారం చేస్తున్నా.. వారికీ అభ్యర్థి కరువయ్యాడని రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఇదిలావుంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ ‌పార్టీకి దూరంగా ఉంటున్న నేతలను తిరిగి పార్టీలోకి తీసుకువొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇతర పార్టీలో అసంతృప్తి నేతలను ఆహ్వానించేందుకు ఆయన ఇప్పటికే సంకేతాలు పంపినట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగా మంగళవారం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో రేవంత్‌రెడ్డి భేటి అయ్యారు. కొండా ఇంటికి వెళ్లి రేవంత్‌ ‌సమావేశమయ్యారు. కాంగ్రెస్‌లోనే కొనసాగాలని కొండాతో రేవంత్‌ ‌చర్చలు జరిపినట్లు తెలిసింది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక తర్వాత విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్‌ ‌పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత విశ్వేశ్వరరెడ్డితో పలువురు నేతలు మంతనాలు జరిపారు. అయితే ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఆయన ఏ పార్టీలో చేరలేదు. ఇటీవల మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ‌బీజేపీలో చేరుకముందు ఆయనతో విశ్వేశ్వరరెడ్డి, టీజేఎస్‌ అధినేత కోదండరాం చర్చలు జరిపారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓ ప్రత్యామ్యాయ వేదికను ఏర్పాటు చేయాలనే ఆలోచనతోనే ఈటలతో భేటీ అయినట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రేవంత్‌ ‌భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు విశ్వేశ్వరరెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం కూడా జరుగుతోంది.

Leave a Reply