- PCC leaders బుధవారం కొండపోచమ్మ కాలువకు గండిపడిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న టిపిసిసి నేతలు..
- గండిని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న టిపిసిసి చీఫ్ ఉత్తమ్
- అవినీతిపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడుతాం
- ఇరిగేషన్ ఈఎన్సి హరిరాంను సస్పెండ్ చేయాలి టిఆర్ఎస్ కార్యకర్తగా జిల్లా కలెక్టర్
- సిఎం కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు రాడు.. కలెక్టర్ ప్రజల్ని పట్టించుకోడు: టిపిసిసి చీఫ్ ఉత్తమ్ ఫైర్
- కొండపోచమ్మ కాలువ గండిని పరిశీలించిన పిసిసి నేతలు
సిద్ధిపేట జిల్లా మర్కుక్‌లోని శ్రీ కొండపోచమ్మ రిజర్వాయర్ కుడి కాలువ గండిపడి శివారు వెంకటాపూర్‌కు చెందిన పంట పొలాలు, ఇండ్లు నీట మునిగిన పరిసర ప్రాంతాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంటు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, డిసిసి ప్రెసిడెంటు తూంకుంట నర్సారెడ్డి బుధవారం పరిశీలించారు. ముంపునకు గురైన శివారువెంకటపూర్ గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. అనంతరం టిపిసిసి చీఫ్ ఉత్తమ్ మాట్లాడుతూ…పాజెక్టుల నిర్మాణం రైతుల కోసమా..? కేసీఆర్ కోసమా?అని ప్రశ్నించారు. ప్రాజెక్టు ప్రారంభించిన నెల రోజుల్లోనే కాలువలకు గండి పడటం ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోందని ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి సిఎం కేసీఆర్ తె•లంగాణ రాష్ట్రాన్ని తా••ట్టు లక్షల కోట్ల రూపాయలు అప్పులుగా తెచ్చారనీ, అప్పులుగా తెచ్చిన డబ్బులతో నాసిరకం ప్రాజెక్టులను నిర్మించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతిపై రాష్ట్ర స్థాయిలో నిలదీస్తామన్నారు. కాలువలకు గండి పడటం సహజం అంటున్న ఈఎన్సి హరిరాంను వెంటనే సస్పెండ్ చేయాలని ఉత్తమ్ డిమాండు చేశారు. గండ్లు పడే ప్రాజెక్టులు, కాలువలు నిర్మిస్తున్నారా ?అని నిలదీశారు. కాలువకు గండి పడితేనే ఇలా ఉంటే.. ప్రాజెక్టులకు గండి పడితే పరిస్థితి మరెంత ప్రమాదకరంగా ఉంటుందో ప్రజలే గుర్తించాలన్నారు.
కాలువ గండి పడి నష్టపోయిన శివారు వెంకటాపూర్ బాధితులకు వెంటనే నష్టపరిహారం అందించాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పనులు ఎంత నాసిరకంగా జరుగుతున్నాయో చెప్పడానికి కొండపోచమ్మ ప్రాజెక్టులకు పడుతున్న గండ్లు నిదర్శనమనీ, తెలంగాణ ప్రజలను, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి వేల కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టులు ఇలా కొట్టుకుపోతే భవిష్యత్ ఏమిటి అని ప్రశ్నించాఉ. అవినీతి అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాం…ఊరుకునేది లేదన్నారు. అక్రమాలకు పాల్పడిన ఈఎన్సిని ఉన్నతాధికారులు వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు నష్టాన్ని మొత్తం కాంట్రాక్టర్ నుంచి వసూలు చేయాలన్నారు. ముంపునకు గురైన గ్రామాలకు, నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలన్నారు. అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. సిఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే ప్రాజెక్టుల పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్రంలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. సిద్ధిపేట జిల్లాకు చెందిన కలెక్టర్ వెంకట్రామరెడ్డి టిఆర్ఎస్ పార్టీ చొక్కా వేసుకుని ఓ కార్యకర్తగా పనిచేస్తున్నారనీ ఉత్తమ్ ఆరోపించారు.జిల్లా కలెక్టర్ కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనీ, కలెక్టర్ ఎవరి రియల్ ఎస్టేట్ పార్టనర్ అయినా… జిల్లా కలెక్టర్‌గా ప్రజలను మరిచిపోకండన్నారు. నేను ఒక పార్లమెంటు సభ్యుడుగా, పిసిసి చీఫ్‌గా ఫోన్ చేస్తే కూడా జిల్లా కలెక్టర్‌గా ఉండి ఫోన్ ఎత్తలేదన్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే సిఎం హోదాలో కేసీఆర్ బయటకు వచ్చి చూడరు, కలెక్టర్ట అయి ఉండి వెంకట్రామరెడ్డి ప్రజల కష్టాలను చూడరు. అంటే, ప్రజలను గాలికి వదిలివేయడమా?అని అన్నారు. ఈ కొండపోచమ్మ ప్రాజెక్టు నాసిరకం పనులు తెలంగాణ ప్రాజెక్టులకే ప్రతిబింబిస్తుందనీ, అవినీతి, అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను చేపడుతుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వీరి వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు నాయిని యాదగిరి, వంటేరు నరేందర్‌రెడ్డి, కొన్యాల బాలకృష్ణారెడ్డి, గోపాల్‌రావు, దరిపల్లి చంద్రం, దేవులపల్లి యాదగిరి, కేశిరెడ్డి రవీందర్‌రెడ్డి, అత్తు ఇమామ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, మంగళవారం ఉదయం ఏడు గంటగంటల ప్రాంతంలో కొండపోచమ్మ సాగర్ నుండి యాదాద్రి జిల్లాకు నీటిని పంపే కుడి కాలువకు మర్కుక్ మండలం శివారువెంకటాపురం వద్ద గండి పడిన విషయం తెలిసిందే.