ఏలాగయితే రైతబీమా పథకాన్ని ఇస్తున్నారో చేనేత కార్మికుల కూడా చేనేత బీమా ఇవ్వాలని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. నవంబర్ 3న జరగనున్న దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మద్దతుగా సోమవారం నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన పాదయాత్ర చేశారు.
అందులో భాగంగా దుబ్బాకలో ఉన్న చేనేత కో అప్రేటివ్ సంఘంలో చేనేత కార్మికులను కలిశారు. వారి సాధక బాధలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిసిసి చీఫ్ ఉత్తమ్ మాట్లాడుతూ… చేనేత కార్మికుల పక్షాన కాంగ్రెస్ నిలబడుతుందన్నారు. చేనేత కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పోరాటాలైన చేసేందుకు సిద్ధంగా ఉంటుందన్నారు.