Take a fresh look at your lifestyle.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉపాధ్యాయులకు అన్యాయం

  • బదిలీలలో స్థానికతను పరిగణనలోనికి తీసుకోవాలి
  • సీఎం కేసీఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి : ఉపాధ్యాయలు, ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం జారీ చేసిన జీఓ 317ను వెంటనే ఉపసంహరించుకోవాలని పీసీసీ చీఫ్‌ ఎ.‌రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలకు స్థానికతను మాత్రమే పరిగణనలోనికి తీసుకోవాలని పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం రేవంత్‌ ‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు ఉద్యోగులు, ఉపాధ్యాయులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయనీ ప్రభుత్వ వైఖరి కారణంగా సొంత జిల్లాలోనే వారంతా స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కొత్త జోనల్‌ ‌విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికి వరంగా మరికొందరికి శాపంగా మారిందని పేర్కొన్నారు. జీఓ నం.317 అమలు కారణంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉపాధ్యాయులు అన్యాయానికి గురయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగుల విభజనలో స్థానికతను పరిగణనలోనికి తీసుకోవడం లేదనీ, ఉమ్మడి జిల్లా యూనిట్‌గా సీనియార్టీనే ప్రాతిపదికగా తీసుకుని సీనియర్లకు వారి ఆప్షన్‌ ‌మేరకు పోస్టింగ్‌లు ఇస్తున్నారని విమర్శించారు. దీంతో దాదాపు 20 నుంచి 30 ఏళ్లు స్థానికేతరులుగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బదిలీల కారణంగా సొంత జిల్లాను ఉన్న పళంగా వదిలి వెళ్లాల్సిన పరిస్తితి ఏర్పడిందన్నారు. సినియారిటీ ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను, ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి విధంగా విడుదల చేసిన జీవో 317ను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ప్రస్తుతం బదిలీలకు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల కారణంగా సొంత జిల్లాలో ఉద్యోగులు పనిచేసే పరిస్థితి ఉండదనీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించిన తరువాతనే రూపొందించే మార్గదర్శకాల ఆధారంగా బదిలీల పక్రియను చేపట్టాలని అవసరమైతే జూనియర్ల కోసం సూపర్‌ ‌న్యూమరీ పోస్టులను సృష్టించాలని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో కోరారు.

Leave a Reply