Take a fresh look at your lifestyle.

వేలాది కోట్ల అవినీతికి పాల్పడ్డ సిఎం కెసిఆర్‌

‌బిజెపి నేతల ఆరోపణలనే పట్టించుకోని కేంద్రం
మోడీ, అమిత్‌ ‌షాలతో కెసిఆర్‌ ‌మంధం బలమైనది
రెండోరోజు కాంగ్రెస్‌ ‌శిబిరంలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి

‌సీఎం కేసీఆర్‌ ‌వేలాది కోట్ల అవినీతికి పాల్పడ్డారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై కేంద్రం ఎందుకు చర్య తీసుకోవడం లేదో అనుమానాలు కలుగుతున్నాయన్నారు. స్వయంగా బిజెపి నేతలే అవినీతి ఆరోపణలు చేసి జైలుకు పంపుతామన్న సవాళ్లను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్‌ ‌కార్యకర్తల శిక్షణా శిబిరంలో రెండరోజు రేవంత్‌ ‌మాట్లాడుతూ గత 5 నెలలుగా కేంద్ర మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ‌కోసం చూస్తున్నామని, కేసీఆర్‌ అవినీతిపై ఆధారాలు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ ఏర్పడితే నీళ్లు, నియామకాలు మన చేతుల్లోకి వొస్తాయన్నారు. నీళ్లు, నియామకాలు అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని కొల్లగొట్టారు. ప్రాణహిత, చేవెళ్ల నిర్మిస్తే కవి•షన్లు రావని రీడిజైన్‌ ‌చేశారు.

ప్రాజెక్టులపై వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించే దమ్ము ప్రభుత్వానికి ఉందా? కాళేశ్వరం అవినీతి నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని రేవంత్‌రెడ్డి సవాల్‌ ‌విసిరారు. కాంగ్రెస్‌ ‌భయంతోనే ప్రధాని మోదీ డైరెక్షన్‌లో సీఎం కేసీఆర్‌ ‌ప్రెస్‌వి•ట్లు పెట్టి బీజేపీని తిట్టినట్టు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌, ‌మోదీ, కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌షాల బంధం గట్టిదని, అందుకే కేసీఆర్‌ ‌తన ప్రెస్‌వి•ట్లలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను తిడుతున్నారేకానీ ఆ పార్టీని ప్లలెత్తు మాట అనడంలేదని అన్నారు. కేసీఆర్‌ ‌ప్రెస్‌వి•ట్లు నాటు సరసంలా ఉన్నాయని, కాంగ్రెస్‌ను గేమ్‌ ‌నుంచి తప్పించాలన్న వ్యూహం తోనే ఆయన ప్రెస్‌వి•ట్లు నడుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ ‌కుటుంబం అవినీతిలో మునిగిపోయిందని నిర్మల్‌ ‌సభలో అమిత్‌షా చెప్పారు, కానీ వారి మధ్య ఉన్న బంధంతోనే కేసీఆర్‌ ‌ధైర్యంగా ఉంటున్నారని పేర్కొన్నారు. దేశంలో అత్యంత కీలకమైన వ్యక్తుల వి•ద కేసులు పెట్టిన ఢిల్లీ పెద్దలు కేసీఆర్‌ ‌కుటుంబాన్ని మాత్రం టచ్‌ ‌చేయలేదన్నారు.  బండి సంజయ్‌ను సవాల్‌ ‌చేసిన కేసీఆర్‌కు మోదీని సవాల్‌ ‌చేసే దమ్ముందా అని రేవంత్‌ ‌ప్రశ్నించారు.

Leave a Reply