Take a fresh look at your lifestyle.

దళితబంధును కావాలనే ఆపించారు

  • ఈ విషయంలో టిఆర్‌ఎస్‌, ‌బిజెపి తోడుదొంగలు
  • పాత పథకమే అయితే ఇసిని కలసి ఎందుకు అడగరు
  • రెండు పార్టీలను ప్రశ్నించిన పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి

టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ తోడు దొంగలని వారివల్లే హుజురాబాద్‌లో దళితబంధు పథకం ఆగిపోయిందంటూ కాంగ్రెస్‌ ఎం‌పీ, పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దళిత బంధు ఆపడంలో టీఆర్‌ఎస్‌-‌బీజేపీ తోడు దొంగలు..ఇద్దరి కుమ్మక్కులో భాగమే దళిత బంధు ఆగిపోవడమని ఆయన విమర్శించారు. ఇక, రైతు బంధు అగొద్దని ఎన్నికల కమిషన్‌ ‌దగ్గర అమలు చేసిన సీఎం కేసీఆర్‌..‌దళిత బంధు విషయంలో ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రశ్నించారు. దళితబంధు పాత పథకమని టీఆర్‌ఎస్‌ ‌చెప్తుంటే.. ఎందుకు ఇప్పుడు ఆగిందని నిలదీశారు. కావాలనే దీనిని ఇసితో ఆపించారని, దీనిని బట్టి ఇది ప్రచారార్భాట పథకం అని తెలుస్తుందన్నారు.

మరోవైపు సీఎం కేసీఆర్‌, ‌సీఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ ఎం‌దుకు దళిత బంధు అమలుకు చొరవ చూపడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు ఎందుకు ఎన్నికల అధికారులను కలవడం లేదు? అని ప్రశ్నించిన ఆయన..టీఆర్‌ఎస్‌-‌బీజేపీ ఇద్దరు నాటకం ఆడుతున్నారని..అందులో భాగంగానే దళిత బంధు ఆగిపోయిందన్నారు. హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాదు..రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మందికి ఈ పథకం అమలు చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. బీసీల వి•దకు దళితులను ఉసిగొలిపే చర్యలకు సీఎం దిగుతున్నారని ఆరోపించిన ఆయన.. సీఎం కులాల మధ్య చిచ్చు పెట్టే కామెంట్స్‌పై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్‌పై కేసు పెట్టి జైల్లో పెట్టాలని డిమాండ్‌ ఆయన చేశారు. దళితులను సీఎంను చేయండని దళితులు అడగలేదు.. మూడెకరాల భూమి అడగలేదు.. వర్గీకరణ జరగాలని డిమాండ్‌ ‌చేశారన్నారు. సీఎం కేసీఆర్‌ని అడుగుతున్న వర్గీకరణ కోసం ఎందుకు ఢిల్లీకి తీసుకెళ్లడం లేదని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి అని నిలదీశారు.

Leave a Reply