Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌, ‌మోడీది ఫెవికాల్‌ ‌బంధం

యూపి ఎన్నికలపై వారిద్దరి మధ్యా అవగాహన
పాదయాత్రతో బండి సంజయ్‌ ‌మోకాలు చిప్పలు అరగడం ఖాయం
ఈటల రాజేందర్‌, ‌బండి సంజయ్‌ ఇద్దరూ బందీలే
ఢిల్లీలో వి•డియాతో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి
కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన నూతన పిసిసి కమిటీ

సీఎం కేసీఆర్‌..‌ప్రధాని మోడీలది ఫెవికాల్‌ ‌బంధమని..వీరిద్దరూ కలసి ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా మాట్లాడుకున్నారని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. ఈటల రాజేందర్‌, ‌బండి సంజయ్‌ ఇద్దరూ జైలులో బందీ అయ్యారని, వీరి మధ్యలో బండి సంజయ్‌ ‌మోకాలి చిప్పలు అరిగిపోతాయని ఆయన ఎద్దేవా చేశారు.

 

బుధవారం కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్య నేతలతో కలసి సోనియా, రాహుల్‌ ‌గాంధీలను కలసి చర్చించారు. అనంతరం వి•డియాతో మాట్లాడుతూ..కొత్త పిసిసి కమిటీ ఎన్నిక చేసినందుకు సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీకి ధన్యవాదాలు తెలిపామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ చేపట్టిన కార్యకలాపాలపై చర్చించి వారి నుంచి సూచనలు తీసుకున్నామని తెలిపారు. అనేక రాజకీయ పరిణామాల తర్వాత కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణ ఇచ్చిందని, కానీ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఇప్పుడున్న ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఢిల్లీలో స్థలం కేటాయించే బదులు అమరవీరుల స్థూపాలకు స్థలం కేటాయిస్తే బాగుండేదని ఆయన పేర్కొన్నారు. ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ఎలక్షన్స్ ‌లక్ష్యం గా ఢిల్లీలో కేసీఆర్‌ అమిత్‌ ‌షాల మధ్య చర్చలు సాగాయని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేయాలో, అక్కడ సీఎం యోగిని ఏవిధంగా గెలిపించాలనే విషయం పైనే ప్రధానితో చర్చించారని ఆయన అభిప్రాయపడ్డారు.

 

రాష్ట్ర ప్రజల్ని చీకట్లో నెట్టేసిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యార్థులు, రైతులు, మహిళలు, గిరిజనులు దళితులు, ఉద్యోగులు, అందరూ అసంతృప్తిగా ఉన్నారని, సమస్యలన్నిటిపైనా ఒక కార్యాచరణ రాష్ట్ర కమిటీ చేపట్టిందన్నారు. అందులో భాగంగానే దళిత గిరిజన సభ కార్యక్రమాలు చేపట్టామన్నారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న వైనంతోపాటు, ప్రాజెక్టుల్లో అవినీతిపై రాహుల్‌ ‌గాంధీతో చర్చించమని రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. ప్రతి మూడు నెలలకొకసారి రాష్ట్రంలో పర్యటించాలని రాహుల్‌ ‌గాంధీని కోరామని తెలిపారు. డిసెంబర్‌ 9 ‌నుంచి కాంగ్రెస్‌ ‌పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనికి రాహుల్‌ ‌గాంధీని ఆహ్వానిస్తే.. తప్పకుండా వొస్తామని చెప్పారని ఆయన తెలిపారు. కేంద్ర కాంగ్రెస్‌ ‌పార్టీ పర్యవేక్షణలో రాష్ట్ర నాయకత్వం ముందుకు వెళుతుందని ఆయన వివరించారు. రాహుల్‌ ‌గాంధీ సూచనల మేరకు రాష్ట్ర కాంగ్రెస్‌ ‌కమిటీ  ముందుకు వెళ్తుందన్నారు. రాష్ట్రానికి పెద్ద సమస్య కల్వకుంట్ల కుటుంబమేనని, కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌విచక్షణ కోల్పోయి మాట్లాతున్నారు, వారి మానసిక స్థితి బాగాలేదని రేవంత్‌ ‌రెడ్డి ఎద్దేవా చేశారు. 

Leave a Reply