Take a fresh look at your lifestyle.

తెలంగాణ వాటాకోసం పోరాటం చేస్తాం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి

శ్రీశైలం జలాల్లో తెలంగాణ వాటా కోసం పోరాటం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు .పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచితే తెలంగాణకకు తీవ్ర అన్యాయమని అన్నారు. మంగళవారం పీసీసీ ముఖ్యనేతలతో ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ ‌లో ఉత్తమ్‌ ‌తోపాటు రాష్ట్ర ఇన్‌ ‌ఛార్జ్ ‌కుంతియా ,ఎమ్మెల్యే లు ,మాజీ మంత్రులు ,ఎంపీ లు ఇతర నాయకులు పాల్గొన్నారు. పోతిరెడ్డి పాడుపై నేతల అభిప్రాయాలను ఆయన తీసుకున్నారు. కేసీఆర్‌, ‌జగన్‌ అలయ్‌బలయ్‌ ‌తీసుకున్నారని. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదన్నారు.కాళేశ్వరం ప్యాకేజీ పనులకు ఓపెన్‌ ‌టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. అంచనాలు రెట్టింపు చేసి రూ.21వేల కోట్లతో టెండర్లు పిలిచారని వ్యాఖ్యానించారు. కమీషన్ల కోసం టీఆర్‌ఎస్‌ ‌నేతలు ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని ఉత్తమ్‌ ‌మండిపడ్డారు..

వాడి వేడి గా చర్చ కొనసాగింది ….
ఈ వీడియో కాన్ఫరెన్స్ ‌లో  నేతల మధ్య  వాడి వేడి గా  చర్చ జరిగింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, ‌మాజీ మంత్రి పొన్నాల మధ్య ఆసక్తికర సంభాషష చోటు చేసుకుంది . పోతిరెడ్డిపాడు వల్ల తెలంగాణకు మొదటినుంచి అన్యాయం జరుగుతోందని  ఉత్తమ్‌  ‌ప్రస్తావించగా దీని పై  మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆనాడు పోతిరెడ్డిపాడుకు కేబినెట్‌ ఆమోదించిందని కాంగ్రెస్‌ ‌పార్టీ మద్దతు ఇచ్చిందని పొన్నాల గుర్తు చేశారు.  మరోవైపు కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలపై విహెచ్‌ ‌పోతీరెడ్డిపాడుకు వ్యతిరేకంగా ఆనాడు పీజేఆర్‌, ‌శశిధర్‌ ‌రెడ్డి గట్టిగా పోరాడారని గుర్తు చేశారు. వైఎస్‌ ‌మీద పోరాడి పీజేఆర్‌ ‌మరణించారని చెప్పారు.

Leave a Reply