Take a fresh look at your lifestyle.

తపాల ఖాతాదారుల డబ్బులు తిరిగి చెల్లించాలి

పినపాక పట్టీనగర్‌ ‌లో గల బ్రాంచ్‌ ‌పోస్టు కార్యాలయంలో తాము దాచుకున్న సొమ్ము బ్రాంచ్‌ ‌మాస్టర్‌ ‌దోచుకున్నాడని మాకు న్యాయం చేయాలని తమ కుటుంబాలు రోడ్డున పడకుండా తమ సొమ్మును ఇప్పించండి మహాప్రభో అంటూ భాధిత ఖాతాదారులు వేడుకుంటున్నారు. నిరుపేదలైన తాము కూలీ పనులు చేసుకుంటూ ప్రభుత్వ రంగమైన తపాలా కార్యాలయంలో నగదును డిపాజిట్‌ ‌రూపంలో దాచుకుంటే ఇక్కడ కూడ ఖాతాదారులు నగదుకు భద్రత లేకుండా పోతుందని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. బూర్గంపాడు మండల పరిధిలోని పినపాక పట్టీనగర్‌లో గల బ్రాంచ్‌ ‌కార్యాలయంలో బ్రాంచ్‌ ‌మాస్టర్‌ ‌ఖాతాదారుల నగదును స్వాహా చేసిన సంఘటన విధితమే. కాగా గురువారం బాధిత ఖాతాదారులు బ్రాంచ్‌ ‌తపాల కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా భాదిత ఖాతాదారులు మాట్లాడుతూ సేవింగ్‌ ‌డిపాజిట్‌ ‌పుస్తకంలో ఉన్నపోస్టల్‌ ‌ముద్ర ఆధారంగా నగుదును చెల్లింటం జరుగుతుందని ఆశాఖ అధికారులు తెలుపుతున్నారని అన్నారు. అయితే 2 లక్షల 85వేల మాత్రమే చెల్లింపు చేసేందుకు తపాల ఉన్నత స్థాయి అధికారులు సిద్దంగా ఉన్నారని కానీ అనధికారంగా డిపాజిట్‌ ‌పుస్తకాలలో తమ వద్ద నుండి తీసుకుని సేవింగ్స్ ‌పుస్తకంలో జమాగా వ్రాయనట్టు వంటి నగుదును కూడ ఇప్పించాలని ఆవేదన వ్యక్తం చేసారు.

రోజుకూలీ పనులు చేసుకుంటూ నోటి కాడి కూడును సైతం కాదని రూపారూపాయి దాచుకుంటు న్నామని కాని తమకు ఇంత అన్యాయం జరుగుతుందని ఊహించలేదని తెలిపారు. ఈ భాధితుల్లో అధిక సంఖ్యలో వితంతులు ఉన్నారు. ఇంట్లో కూతురు, కొడుకు కు తెలియకుండా కష్టం వస్తే సహాయంకి ఉంటాయని దాస్తే ఈ విధంగా బ్రాంచ్‌ ‌పోస్టు మాస్టర్‌ ‌సొమ్మును కాజేయటం పై అధికారులు చర్యలు తీసుకోవడం విఫలం చెందుతున్నారని ఆరోపించారు. కూతురు పెళ్ళి కోసం దాచుకున్న నగుదును సైతం లెక్కలు చూపకుండా తీసుకున్న వ్యక్తి ఎక్కడ ఉంటాడో అధికారులకు తెలిసి కూడ తమకు న్యాయం చేయటం లేదని ఆరోపించారు. ఇప్పటికైన తపాల శాఖ ఉన్నత స్థాయి అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయంతో సగటు మనిషికి తపాల కార్యాలయంపై ఉన్న నమ్మకం పోయే ప్రమాదం ఉందని ఇటువంటి సంఘటనలు జరిగితే వెంటనే అధికారులు త్వరితగతిన భాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు. లేకుంటే తపాల వ్యవస్థ ప్రజల్లో అబాసుపాలు అయ్యే ప్రమాదం ఉందని, తపాలాల్లో సొమ్ము దాచుకుంటే రక్షణ లేకుండా పోతుందని అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతుందని అన్నారు.

Leave a Reply