ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ భద్రాచలం ద్వారా డా. నరేష్ భార్య పావనికి 6 లక్షల రపాయలను చెక్కు రూపంలో అందించారు. ఇందులో 4 లక్షల రూపాయలు డా. అప్పా రావు, 2 లక్షల రూపాయలు రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసో•యేషన్ వారు అదేవిధంగా స్టేట్ గవర్న మెంట్ డాక్టర్ల సంఘం సహకారంతో అందించారు. ఈ సందర్బంగా డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు రీజనల్ డైరెక్టర్ మెడికల్ సర్వీస్ డా. జివివి సుదర్శనరావు మాట్లాడుతూ క్రీయా శీలక నిబద్దతతో కష్టపడి పనిచేసిన ప్రోగ్రాం ఆఫీసర్ అని చివరకు కరోనా వ్యాధిని అరికట్టుటకు ప్రాణ త్యాగం చేసిన గొప్పయోధుడు అని ఆవదేన వ్యక్తం చేసారు. డా. ఎస్ఎల్ కాంతారావు మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఆరోగ్య మంత్రి, 50 లక్షల రూపాయలు మంజూరు చేసే ఎక్స్గ్రేషియా ఒక కోటి రూపా యలకు పెంచగలరని అన్నారు. మృతి చెందిన ఆయన భార్యకు ఉద్యోగం కల్పించి వారి కుటుం బాలను ఆదుకోవాలని కోరారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్దికి సంక్షేమానికి ముందు ఉంటారని వారు చనిపోయిన డాక్టర్లను కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా మంజూరు చేసిన యెడల కరోనాను అరికట్టుటకు కష్టపడి పనిచేస్తున్న గవర్నమెంటు డాక్టర్లను డెత్ రేట్ తగ్గించి సేవలు అందిస్తున్న డాక్టర్లకు మనోధైర్యం కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.జివివి సుదర్శన్రావు, డా. పవన్, డా. వెంకటరావు, డా. కోటిరెడ్డి, డా. యుగందర్, డా. కృష్ణ, ప్రసాద్ తదిత•రులు పాల్గొన్నారు.