Take a fresh look at your lifestyle.

‌బీజేపి చేతిలో పవన్‌కళ్యాణ్‌ ‘‌బకరా’

“బీజేపీ రాజధానిపై గందరగోళ వైఖరి కారణంగా ఆ పార్టీకి ఒక బలిపశువు కావాలి. అది తెరవెనుక ఉండి ఆడించేందుకు బలిపశువు అవసరం. రాజధానిపై బీజేపీ సంచలనాత్మకంగా ఏమీ ప్రకటించలేదు. రాయలసీమ డిక్లరేషన్‌   ‌కాకుండా,  పవన్‌ ‌కల్యాణ్‌ను తమ వానిగా ఉపయోగించుకోవడానికి బీజేపీ వ్యూహం తయారు చేసింది. దీనిపై దృష్టి పెట్టిన వారికి ఇది బీజేపీ  అనుసరించే వ్యూహంలో భాగంగా అనిపిస్తుంది. ఇదే కాదు ఏ అంశంపైనైనా బిజేపీ వైఖరి ఇలాగే ఉంటుంది. బీజేపీ క్షణం క్షణం మాట మారుస్తుంటుంది.  అమరావతి విషయంలోనూ అంతే. రాజధానిపై బీజేపీ  వైఖరి గందరగోళంగా ఉందని  పవన్‌ ‌తెలుసుకోవాలి.”

Rayalaseema Declaration, bjp amaravathi, capital of andhra, janasena party, pawan kalyan
తమకు తాము బలిపశువుగా మారడం కన్నా ఎవరో ఒకరిని అందుకు ఎంచుకోవడం ఉత్తమ మార్గం. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర రాజధాని అంశంపై గందరగోళ వైఖరులను ప్రదర్శించేందుకు ఒక బలిపశువును ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటు కోసం కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ, అమరావతి నుంచి రాజధానిని తరలించలేరు, ఒక వేళ తరలిస్తే మళ్ళీ వెనక్కి తెస్తానని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ ‌కల్యాణ్‌ ‌ప్రతిన చేశారు. వైసీపీని భూస్థాపితం చేసేవరకూ నిద్రపోనని ఆయన శపథం చేశారు. పవన్‌ ‌కల్యాణ్‌ ఒక రాజకీయ వేత్త పాత్ర పోషించేందుకు ఎంతో శ్రమ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శరవేగంగా మారుతున్న రాజకీయాల నేపథ్యంలో తమ పార్టీని ఎవరితో జోడించాలా అని తీవ్రంగా ఆలోచన చేసి చివిరికి బీజేపీతో కలిసి పయనించేందుకు నిర్ణయించుకున్నారు. బీజేపీతో కలిసి పని చేయడానికి సంబంధించి పవన్‌ ‌కల్యాణ్‌ ‌రాసుకున్న స్క్రిప్టు సిద్ధంగా ఉంది. స్క్రిప్టు చాలా స్పష్టంగా కూడా ఉంది. భారత రాజకీయాల్లో వారం రోజులు సుదీర్ఘకాలం కాకపోవచ్చు. సినీరంగంలో పేరు సంపాదించిన నటుడు పవన్‌ ‌కల్యాణ్‌ ఆరు సంవత్సరాలుగా రాజకీయ వేత్తగా తనను తాను రుజువు చేసుకునేందుకు చాలా శ్రమ పడుతున్నారు. ఇక ఇప్పుడు బీజేపీ మార్గదర్శకంలో పని చేస్తారన్న మాట. వైఎస్‌ ‌జగన్‌ ‌ప్రభుత్వం కూలిపోయే వరకూ తాను విశ్రమించబోనంటూ పవన్‌ ‌కల్యాణ్‌ ‌చేసిన ప్రకటన రాజధాని అంశంపై బీజేపీ సందిగ్ధ వైఖరిని తెలియజేస్తోంది, రాజకీయాల్లో ప్రజాదరణ పొందిన సినిమాల్లో మాదిరిగా కాలాన్ని బట్టి పల్లవులను అందుకుంటూ ఉండాలి. అందువల్ల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న పవన్‌ ‌కల్యాణ్‌ ఈ ‌విషయాలను గురించి తెలుసుకోవాలి, రాజధాని అంశంపై బీజేపీ వేర్వేరు రాగాలను రూపొందిస్తోంది.

- Advertisement -

బహుశా ఈ విషయం పవన్‌ ‌కల్యాణ్‌కు తెలియదేమో. అందువల్ల పవన్‌ ‌కల్యాణ్‌ ‌కోరస్‌లో భాగంగా సరిపెట్టుకోవాలి తప్ప ప్రధాన పాత్ర వహించలేరు. బీజేపీ వైఖరిని ఆయన గుర్తు చేసుకోవడం మంచిది. బీజేపీతో కలిసి నడుద్దామని నిర్ణయించుకున్న దృష్ట్యా ఈ వాస్తవాన్ని ఆయన తప్పని సరిగా తెలుసుకోవాలి. ఆయనకు గుర్తుందో లేదో బీజేపీ, తెలుగుదేశం మధ్య దూరం 2018 ఫిబ్రవరిలో పెరిగింది. కర్నూలులో జరిగిన సమావేశాల్లో బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌ ‌ప్రకటించింది. ఆ డిక్లరేషన్‌లో రాయలసీమలో హైకోర్టునూ, రెండవ రాజధానిని ఏర్పాటు చేయాలనీ, పాలనా రంగానికి సంబంధించి సచివాలయం సహా అన్ని శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర శాసనసభ, తాత్కాలిక రాజభవన్‌ ఏర్పాటు చేయాలని ఆ బీజేపీ డిమాండ్‌ ‌చేసింది. అందువల్ల బీజేపీ వైపు నుంచి చూస్తే విన్‌ ‌విన్‌ ‌పద్దతిలో రాయలసీమ ఆశలు, అమరావతి రైతుల ఆకాంక్షలు తీర్చాలి. అయితే, పవన్‌ ‌కల్యాణ్‌ ‌మరో సారి పిల్లి మొగ్గ వేశారు. పిల్లి మొగ్గలు వేయడంలో ఆయన ఆరితేరిన వారు. రాజధానిపై బీజేపీ తన అభిప్రాయానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన ఇరకాటంలో పడాల్సి వస్తుంది. అధికార వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చినట్టు జగన్‌ ‌ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రాయలసీమ డిక్లరేషన్‌ ‌బీజేపీని వెంటాడుతూనే ఉంటుంది. ప్రతి సారి ఆ పార్టీ రాజధానిపై కొత్త మాటను తెరమీదికి తెస్తుంది. అంటే పవన్‌ ‌కల్యాణ్‌ అదే మాట మాట్లాడాలి. బీజేపీకి బలిపశువు కావడం అన్న మాట. బీజేపీ రాజధానిపై గందరగోళ వైఖరి కారణంగా ఆ పార్టీకి ఒక బలిపశువు కావాలి. అది తెరవెనుక ఉండి ఆడించేందుకు బలిపశువు అవసరం. రాజధానిపై బీజేపీ సంచలనాత్మకంగా ఏమీ ప్రకటించలేదు. రాయలసీమ డిక్లరేషన్‌ ‌కాకుండా, పవన్‌ ‌కల్యాణ్‌ను తమ వానిగా ఉపయోగించుకోవడానికి బీజేపీ వ్యూహం తయారు చేసింది. దీనిపై దృష్టి పెట్టిన వారికి ఇది బీజేపీ అనుసరించే వ్యూహంలో భాగంగా అనిపిస్తుంది. ఇదే కాదు ఏ అంశంపైనైనా బిజేపీ వైఖరి ఇలాగే ఉంటుంది. బీజేపీ క్షణం క్షణం మాట మారుస్తుంటుంది. అమరావతి విషయంలోనూ అంతే. రాజధానిపై బీజేపీ వైఖరి గందరగోళంగా ఉందని పవన్‌ ‌తెలుసుకోవాలి. అది అమరావతి కాదు, భ్రమరావతి అని తెలుసుకోవాలి. దశాబ్దాల క్రితం బీజేపీ కాకినాడలో జరిగిన కార్యవర్గ సమావేశాల్లో ఒక వోటు రెండు రాష్ట్రాల నినాదాన్ని ఇచ్చింది. దానికి కట్టుబడి ఉండకుండా ఎన్నో పిల్లిమొగ్గలు వేసింది. ఇప్పుడు రాయలసీమ డిక్లరేషన్‌ ‌విషయంలోనూ అంతే. తాను బలిపశువు కాకముందే పవన్‌ ‌కల్యాణ్‌ ఈ ‌విషయం తెలుసుకుంటే మంచిది.
– ‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Tags: Rayalaseema Declaration, bjp amaravathi, capital of andhra, janasena party, pawan kalyan

Leave a Reply