కొందరు రాజకీయవేత్తలు తాము ఎన్నటికీ పరిష్కారం కాని చిక్కుముడులమనే భావాన్ని కలిగిస్తారు. నిరంతరం జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తారు. అప్పట్లో భూముల సమీకరణను తప్పు పట్టిన జనసేనాని ఇప్పుడు అమరావతిని ఇక్కడే ఉంచాలనీ, రైతులకు అన్యాయం చేయొద్దంటూ ఆందోళన జరిపేందుకు వొచ్చారు. అసలు అమరావతికి 3 వేల ఎకరాలు ఎందుకని ఆనాడు ప్రశ్నించిన వారిలో ఆయనా ఉన్నారు. అమరావతికి అవసరానికి మించి భూములను చంద్రబాబు ప్రభుత్వం సమీకరించడాన్ని తప్పు పట్టిన వారంతా ఇప్పుడు రైతుల పేరిట ఆయన పార్టీ నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నారు.

వేదాంతులు, గణిత శాస్త్రవేత్తల దశాబ్దాలుగా పరిశోధనలు జరిపి తాము కనిపెట్టిన విషయాలను ఛేదించలేకపోయారు. మనుషుల మనసులను కట్టి ఉంచే అనంతమైన శక్తి ఉందన్న వాస్తవాన్ని కనుగొనలేకపోయారు. సోక్రటీస్ విషయాన్నే తీసుకుంటే గణితశాస్త్రంలో అనంత(ఇన్‌ఫినిటీ)ని కనుగొనలేకపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడు రాజధానుల ప్రతిపాదన రాజకీయ నాయకుల మధ్య వాగ్బాణాలకు కారణం అయింది. సినీ రంగంలో ఓ వెలుగు వెలిగి రాజకీయాల్లో ప్రవేశించిన ఓ నటుడు తాను ఏది చెబితే జనం అది నమ్మేస్తారని అనుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం, బీజేపీ కూటమి తరఫున ప్రచారం చేసి, ఆ రెండు పార్టీల విజయానికీ తన ప్రచారమే కారణమని చెప్పుకున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్… అదే నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజధాని అమరావతి నిర్మాణం కోసం 3 వేలకు పైగా ఎకరాలను రైతుల నుంచి భూమిని సమీకరించినప్పుడు ఈ రాజకీయవేత్త తప్పు పట్టారు. మూడు రాజధానుల ప్రతిపాదన ఇంకా ఖరారు కాలేదు. అందుకే దానిని ప్రతిపాదన అంటున్నాం. ఐదేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు దేశ దేశాల రాజధానులన్నింటినీ పరిశీలించి వొచ్చి నమూనాలను సేకరించారు.
ఏ నమూనా ప్రకారం అమరావతిని నిర్మించాలో తేల్చుకోలేకపోయారు. ఈలోగా పుణ్యకాలం పూర్తి అయింది. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తేగానే అమరావతి రైతుల తరఫున అండగా నిలబడేందుకు వొచ్చారు. అప్పట్లో భూముల సమీకరణను తప్పు పట్టిన జనసేనాని ఇప్పుడు అమరావతిని ఇక్కడే ఉంచాలనీ, రైతులకు అన్యాయం చేయొద్దంటూ ఆందోళన జరిపేందుకు వొచ్చారు. అసలు అమరావతికి 3 వేల ఎకరాలు ఎందుకని ఆనాడు ప్రశ్నించిన వారిలో ఆయనా ఉన్నారు. అమరావతికి అవసరానికి మించి భూములను చంద్రబాబు ప్రభుత్వం సమీకరించడాన్ని తప్పు పట్టిన వారంతా ఇప్పుడు రైతుల పేరిట ఆయన పార్టీ నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నారు. రైతుల తరఫున చంద్రబాబునాయుడు జరిపిన ఆందోళన ఫలించకపోవడంతో జనసేనాని రంగంలో ప్రవేశించారు. ఆయన చెగువేరా, ఫూలే, అంబేద్కర్ వంటి మహనీయుల స్ఫూర్తితో ఆందోళనకారులకు మద్దతుగా వచ్చినట్టు చెప్పుకుంటారు. అయితే, 2018 నవంబర్‌లో అమరావతికి 3 వేల ఎకరాలు ఎందుకంటూ తాను ప్రశ్నించిన విషయాన్ని జనం మరిచి పోయారని ఆయన అనుకుంటున్నారు. ఉద్యమం వొచ్చినట్టు ఆయన చెప్పుకుంటారు. ఆయన వెంట జనం లేరు. అయినా, జనసేనానినని చెప్పుకుంటారు. అయితే, ఆయనను చూడటానికి వొచ్చే వారే జనసైనికులనే భ్రమ కలిగించేందుకు ప్రయత్నిస్తారు. ఆయన ఇటీవల జరిపిన అమరావతి యాత్ర ఆయన చివరి చిత్రం ‘అజ్ఞాత వాసి’లా ఫ్లాప్ అయింది.