Take a fresh look at your lifestyle.

రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి

గర్భిణీల రిజిస్ట్రేషన్‌ ‌తప్పనిసరి -జూలపల్లి పిహెచ్‌సిని సందర్శించిన కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌ 

రోగులకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా కృషి చేయాలని కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌ ‌సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ ‌జూలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సిబ్బంది పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూలపల్లి పిహెచ్‌సి పరిధిలో 5 ఉపకేంద్రాలు పని చేస్తున్నాయన్నారు. ప్రతి సబ్‌ ‌సెంటర్‌ ‌పరిధిలో ఎఎన్‌ఎం‌లు, ఆశావర్కర్లు పనిచేస్తున్నట్లు కలెక్టర్‌కు అధికారులు వివరిం చారు. సబ్‌ ‌సెంటర్ల వారిగా వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలుతీరు, గర్భవతుల రిజిస్ట్రేషన్‌, ‌ప్రసవాలసంఖ్య, కేసిఆర్‌ ‌కిట్‌ల పంపిణి గురిం చి అధికారులను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. పిహెచ్‌సి పరిధిలో ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రులలో ప్రసవాలు జరుగుతున్నందు న, తగ్గించే దిశగా సిబ్బంది కృషిచేయాలన్నారు. హైరిస్క్ ‌కేసులను పెద్దప ల్లి, గోదావరిఖని, సుల్తానాబాద్‌ ఆసుపత్రులకు పంపించాలని కలెక్టర్‌ ‌సూచించారు.

క్షేత్రస్థాయిలో గర్భిణీలను రిజిస్టర్‌ అయినప్పటి నుంచి క్రమం తప్పకుండా ఫాలోఅప్‌ ‌చేయాలన్నారు. జూలపల్లి పిహెచ్‌సి అభివృద్ది కొరకు అవసరమైన ప్రతిపాదనలు పంపిస్తే, డిఎంఎప్‌టి, సిఎస్‌ఆర్‌ ‌నిధుల నుండి ఆసుపత్రికి నిధులు కేటాయిస్తామలఃన్నారు. ఆసుపత్రిలో స్టోర్‌రూం, వెయిటింగ్‌రూం, సేప్టి ట్యాంక్‌ ఇతర పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేయాలని, ఆసుపత్రికి మంజూరైన పోస్టులు వెంటనే భర్తీ చేయాలని అధికారులను కలెక్టర్‌ ‌సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. ఈ సమీక్షలో డిఎంహెచ్‌ఓ ‌డాక్టర్‌ ‌సుధాకర్‌, ‌సంబంధిత అధికారులు, జడ్పిటిసి, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply