Take a fresh look at your lifestyle.

‌కొరోనా జాగ్రత్తలు పాటించని ప్రయాణికులు

  • సాధారణ రోజుల్లో లాగా పోటీపడి ప్రయాణాలు
  • అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ ‌సర్వీసులు
ప్రజాతంత్ర, హైదరాబాద్‌/‌విజయవాడ, జనవరి 12 : కొరోనా  జాగ్రత్తలు మంట కలుస్తున్నాయి. సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లాలనే ఆత్రుతలో ప్రజలు  నిబంధనలు పాతరేస్తున్నారు. బస్సులు, రైళ్లు క్రిక్కిరిసి నడుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు మాస్కులు ధరించడం, భౌఐతిక దూరం పాటించడం, శానిటైజేషన్‌ ‌చర్యలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో కొరోనా  వ్యాప్తి కూడా మళ్లీ తీవ్రంగా పెరుగు తోంది. అలాగే గ్రామాలకు వెళ్లాలనుకుంటున్న సాధారణ, మధ్య తరగతి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. సంక్రాంతి ప్రయాణికులతో బస్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రత్యేక సర్వీసుల్లో సైతం సాధారణ చార్జీలనే టీఎస్‌ ఆర్టీసీ వసూలు చేస్తుండటంతో బస్సెక్కేందుకు ప్రయాణికులు పోటీపడుతున్నారు. రద్దీకి అనుగుణంగా జిల్లాలకు ప్రత్యేక సర్వీసుల సంఖ్యను పెంచుతున్నట్లు, ప్రయాణికులకు సమాచారం ఇచ్చేందుకు 200 మంది ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ చర్యలు తీసుకున్నా..ఇరు రాష్టాల్ర నుంచి బస్సులు నడుస్తున్నా ప్రయాణకుల రద్దీని తట్టుకోలేక పోతున్నాయి. మహాత్మాగాంధీ బస్టాండ్‌లో సంక్రాంతి రద్దీ నేపథ్యంలో యాదగిరిగుట్ట, వరంగల్‌ ‌వెళ్లే బస్సులను ఉప్పల్‌ ‌క్రాస్‌రోడ్‌ ‌నుంచి నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. కర్నూల్‌, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, మాచెర్ల, నెల్లూరు వైపు బస్సులు సీబీఎస్‌ ‌నుంచి, మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేటకు వెళ్లే బస్సులను దిల్‌సుఖ్‌నగర్‌ ‌బస్‌స్టేషన్‌ ‌నుంచి నడుపుతున్నారు. ఎంబీజీఎస్‌ 35, 36 ‌ప్లాటుఫార్మ్ ‌నుంచి టీఎసఆర్టీసీ విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరుకు వెళ్లే సర్వీసులను నడుపుతోంది. ఎంజీబీఎస్‌లో అదనపు విచారణ కౌంటర్లను ఏర్పాటు చేశారు.
సంక్రాంతి స్పెషల్‌ ‌రైళ్లు సమయానికి అందుబాటులో లేకపోవడంతో కుటుంబాలతో సహా స్టేషన్లకు వస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అధిక చార్జీలు చెల్లించి ప్రైవేట్‌ ‌వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు జనవరి 5 నుంచి 25 వరకు మొత్తం 220 రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. 20 రోజుల్లో నేరుగా 176 సర్వీసులను నడిపిస్తుండగా, 32 ట్రిలు ఆయా స్టేషన్ల దుగా వెళ్తున్నాయి. 12 అన్‌రిజర్వ్‌డ్‌ ‌రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా యి. ఈ రైళ్లన్నీ సికింద్రాబాద్‌, ‌నాంపల్లి, లింగంపల్లి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, నాందేడ్‌ ‌స్టేషన్ల నుంచి నడుస్తున్నాయి. నాలుగు రోజులుగా సికింద్రాబాద్‌, ‌లింగంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతీ రైలులో సామర్థ్యానికి మించి కిక్కిరిసి ఉంటున్నారు. సికింద్రాబాద్‌ ‌స్టేషన్‌ ‌నుంచి రోజుకు సగటున 1.80 లక్షల నుంచి 2.10 లక్షల మంది ప్రయాణిస్తున్నారంటే తాకిడి అర్థం చేసుకోవచ్చు. ఒక్కో డివిజన్‌ ‌పరిధిలో స్పెషల్‌ ‌రైళ్లు పదుల సం ఖ్యలోనే నడుస్తున్నాయని ప్రయాణికులు పేర్కొంటున్నారు. 2019లో జనవరి 5 నుంచి 25 వరకు 408 ప్రత్యేక రైళ్లను నడిపించిన దక్షిణ మధ్య రైల్వే.. ఈసారి 220 మాత్రమే అందుబాటులో ఉంచడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇక ప్రైవేట్‌ ‌వాహన డ్రైవర్లు సాధారణ రోజుల కంటే పండగ రోజుల్లో రెండింతల రేట్లు వసూలు చేస్తున్నారు. ఉప్పల్‌ ‌నుంచి హన్మకొండకు ఆర్టీసీ బస్సులో రూ.215 టికెట్‌ ‌ధర ఉండగా, కారు డ్రైవర్లు రూ.400 వసూలు చేస్తున్నారు. ఖమ్మం, విజయవాడ లాంటి ప్రాంతాలకు ఒక్కొక్కరి నుంచి రూ.1500 నుంచి రూ.2000 తీసుకుంటున్నట్లు తెలిసింది. మొత్తంగా డబ్బులు పోయినా ప్రయాణానికి సిద్దం అవుతున్నా కొరోనా  పరిస్తితులను పెద్దగా పట్టించుకోవడం లేదు. మామూలు రోజుల్లో లాగే ప్రయాణాలు సాగిస్తున్నారు.
బస్టాపులలో బారులు తీరిన ప్రయాణికులు
టోల్‌గేట్ల వద్ద సాఫీగా వెళ్లేలా చర్య
లు
సంక్రాంతి పండుగ సపిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులు కూడా వచ్చేశాయి. జనం ఇప్పటికే సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. హైదరాబాద్‌ ‌నగరంలోని పలు బస్‌ ‌ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు బస్టాపుల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. బస్సులతో సహా, ప్రైవేటు ట్రావెల్స్ ‌సంక్రాంతి స్పెషల్‌ ‌బస్సులకు ప్రయాణికులు పోటెత్తారు. పలు ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించటంతో పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు జనం క్యూ కట్టారు. గురువారం నుంచి ఈ రద్దీ మరింత పెరగనుంది.
ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ ‌మండలం పంతంగి టోల్‌ ‌గేట్‌ ‌వద్ద వాహనాల రద్దీ నెలకొంది. వాహనాలు పెద్ద మొత్తంలో వస్తున్నా కూడా… దాదాపు 97 ఫాస్టాగ్‌ ‌కలిగిఉన్నాయి. ఫలితంగా నిమిషాల వ్యవధిలోనే టోల్‌గేట్‌ ‌దాటుతున్నాయి.  గతంతో పోల్చితే టోల్‌గేట్‌ ‌వద్ద గంటల తరబడి వేచి ఉండే సమస్య లేదు. ఫాస్టాగ్‌లో నగదు చెల్లింపుతో టోల్‌ప్లాజాల వద్ద సాఫీగా రాకపోకలు సాగుతున్నాయి. సాధారణ రోజుల్లో కంటే భారీగా వాహనాల రాకపోకలు పెరిగాయి.

Leave a Reply