Take a fresh look at your lifestyle.

జూన్ లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు ..!

  • వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు
  • అర్నాబ్ వాట్సాప్ చాట్ లీక్ వ్యవహారంపై జెపిసి డిమాండ్
  • సమావేశమయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)
  • మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని తీర్మానం

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ : అర్నాబ్ వాట్సాప్ చాట్ లీక్ వ్యవహారంపై జెపిసిని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జూన్ నాటికి కాంగ్రెస్ పూర్తి చేయనున్నది. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన ప్రజా ఆందోళనకు సంబంధించిన అనేక ముఖ్యమైన సమస్యలు ఉన్నాయని సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) శుక్రవారం సమావేశమై, రైతు నిరసన, కొరోనావైరస్ వ్యాక్సిన్, జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్‌ అనే మూడు జాతీయ ప్రాముఖ్యత గల అంశాలపై కాంగ్రెస్ పార్టీ తీర్మానాలను ఆమోదించింది. జూన్ 2021 నాటికి కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి పార్టీలో ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మధుసూదన్ మిస్త్రీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సంబంధించి పలు వివరాలు వెల్లడించారు. రైతుల నిరసనపై సిడబ్ల్యుసి ఒక తీర్మానాన్ని ఆమోదించింది, మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది అని తెలిపారు. ఇంత తక్కువ సమయంలో కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినందుకు శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. వాక్సిన్ వేయించుకోటాని ప్రజలు ముందుకు రావాలని ప్రజలను కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.

రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామి మరియు బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) మాజీ సీఈఓ పార్థో దాస్‌గుప్తా మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ తీర్మానాన్నిఆమోదించి డిమాండ్ చేసింది. రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం నివ్వెరపోయే అహంకారాన్ని ప్రదర్శించింది అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సోనియా గాంధీ అన్నారు.సిడబ్ల్యుసిలో తన ప్రారంభ ప్రసంగంలో తాత్కాలిక పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయని ఆమె అన్నారు.

- Advertisement -

కొనసాగుతున్న రైతుల ఆందోళనపై, ప్రభుత్వం జరుపుతున్న సంప్రదింపులు గొడవగా మారటం వెనుక ప్రభుత్వ అహంకారం ఉందని సోనియా అన్నారు. “మూడు వ్యవసాయ చట్టాలు ఆదరాబాదరాగా తయారు చేయబడ్డాయి. ఈ చట్టాలలో చిక్కులు వాటి ప్రభావాలు వాటిపై అర్ధవంతమైన పరిష్కారాలు సూచించే అవకాశాన్ని పార్లమెంటుకు ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం నిరాకరించింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చాలా స్పష్టంగా ఉంది. MSP, పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్, PDS అనే మూడు స్తంభాలపై ఆధారపడిన ఆహార భద్రత పునాదులను మోడీ ప్రభుత్వం తెచ్చిన ప్రస్తుత వ్యవసాయ చట్టాలు నాశనం చేస్తున్నాయి. అందుకే కాంగ్రెస్ ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుంది” అని సోనియా అన్నారు.

రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామి మరియు బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) మాజీ సిఇఒ పార్థో దాస్‌గుప్తా మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణల లీక్ వ్యవహారంతో జాతీయ భద్రత పూర్తిగా రాజీపడిందని స్పష్టం అయ్యింది అని సోనియా అన్నారు. “కొద్ది రోజుల క్రితం, ఆంటోనీ-జి సైనిక కార్యకలాపాల అధికారిక రహస్యాలు బహిర్గతం చేయడం రాజద్రోహం అని చెప్పారు.ఇంత గంభీరమైన విషయాలపై మోడీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి చూపుతున్నది. దేశభక్తి.. జాతీయవాదం.. సర్టిఫికెట్లు జారీ చేసే వారి అసలు రంగు బహిర్గతం అవుతున్నారు అని సోనియా అన్నారు.

ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు వాక్సిన్ వేయడం ప్రారంభమైందని ఈ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందని కాంగ్రెస్ ఆశించింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ప్రభుత్వం తీరు దేశ ప్రజలపై అనాలోచిత బాధలను రుద్దింది అని ఈ భాధల నివారణకు చాలా సంవత్సరాలు పడుతుంది అని సోనియా అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ భయంకరంగా ఉందని, ఎంఎస్‌ఎంఇ అనధికారిక రంగాల ఆర్థిక వ్యవస్థలో అధిక భాగం క్షీణించిందని సోనియా గాంధీ తెలిపారు.

ప్రజా వ్యయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వవలసి సమయంలో భారీ మొత్తంలో వ్యక్తిగత వానిటీ ప్రాజెక్టులకు ప్రభుత్వ డబ్బు ఖర్చు చేయడం చాలా బాధాకరం. ప్రభుత్వం కార్మిక, పర్యావరణ చట్టాలను బలహీనపరిచిన విధానం..ప్రజా ఆస్తులను విక్రయించడం ఇవన్నీ బాధాకరం అన్నారు. విపరీతమైన ప్రైవేటీకరణ జబ్బు మోడీ ప్రభుత్వాన్ని పట్టుకుంది. ఇలాంటి పనులకి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అంగీకరించదు మద్దతు ఇవ్వదు, అని సోనియా అన్నారు.

Leave a Reply