వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

విభజన సమస్యలు సత్వరమే పరిష్కరించుకుందాం

January 14, 2020

telugu state cm's, meeting latest updates, pothireddypadu, godavari river

  • ప్రగతి భవన్‌లో కేసీఆర్‌, ‌జగన్‌ ‌భేటీ
  • విద్యుత్‌ ‌సమస్యలు, ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులపై సుదీర్ఘ మంతనాలు
  • కృష్ణా ఆయకట్టకు గోదావరి జలాల తరలింపుపై లోతైన చర్చ

ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, ‌జగన్‌ ‌నిర్ణయించారు. విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9, 10‌లోని విద్యుత్‌ ఉద్యోగుల విభజన, సాగునీటి ప్రాజెక్టులలో నెలకొన్న వివాదాలను సామరస్యపూర్వకంగా ముగింపు పలకాలనే అంశాలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏపీ సీఎం జగన్‌ ‌సోమవారం మధ్యాహ్నం లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి మధ్యాహ్నం 1 30 గంటలకు ప్రగతి భవన్‌కు రాగా ఆయనకు సీఎం కేసీఆర్‌ ‌సాదర స్వాగతం పలికి లోనికి తీసుకుని వెళ్లారు. జగన్‌ ‌వెంటన వచ్చిన ఎంపీ విజయసాయి రెడ్డి తదితరులకు మంత్రి కేటీఆర్‌, ఎం‌పి సంతోష్‌కుమార్‌ ‌స్వాగతం పలికారు. మధ్యాహ్న భోజనం తరువాత ఇద్దరు సీఎంలూ దాదాపు 6 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. 2019లో జరిగిన ఎట్‌ ‌హోం కార్యక్రమానికి ఇద్దరూ సీఎంలు హాజరయ్యారు. వారితో గవర్నర్‌ ‌ప్రాథమికంగా భేటీ అయిన సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి స్వాధీనం చేయాలన్న కేసీఆర్‌ ‌సూచనకు జగన్‌ ‌సమ్మతించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో పొందుపరచిన ప్రభుత్వ సంస్థల విభ•న, ఆస్తులు, అప్పుల విభజన, ఉద్యోగుల బదలాయింపు తదితర అంశాలపై ఇద్దరు సీఎంలూ చర్చించినట్లు సమాచారం.

వీటితో పాటు గోదావరి జలాల మళ్లిపు వంటి అంశం సైతం సీఎంల భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. కృష్ణా ఆయకట్టుకు గోదావరి జలాలను తరలింపుపై సమష్గిగా ముందుకు సాగాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించినట్లు తెలిసింది. గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించడానికి తక్కువ వ్యయంతో పాటు నిర్దిష్ట కాల వ్యవధిలో తరలించ వచ్చని ఇద్దరు సీఎంలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. పోతిరెడ్డిపాడు హెడ్‌ ‌రెగ్యుటేటరీ సామర్థ్యం పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తెలంగాణకు గోదావరి జలాలలో భారీ నష్టం కలుగుతుందని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న్నాయి. మరోవైపు, ఈనెల 21న కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానంపై ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల సీఎంలు అనుసరించాల్సిన వ్యూహంపై సైతం చర్చించినట్లు సమాచారం. దీంతో పాటు ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ‌నిర్ణయించిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అందుకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఉద్యమం సాగుతోంది. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై సైతం ఇరువురు సీఎంల భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అలాగే, గత సీఎం) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఇద్దరూ సమీక్షించినట్లు సమాచారం.

Tags: telugu state cm’s, meeting latest updates, pothireddypadu, godavari river