Take a fresh look at your lifestyle.

‘‌సహకార’ ఎన్నికలకు పార్టీల వ్యూహాలు 909 సంఘాలకు ఎన్నికలు

Parties' strategies for Co-operative Societies Elections In telangana

రాష్ట్రంలో ఈ నెల 15న జరుగనున్న సహకార సంఘాల ఎన్నికలకు రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. 2013లో ఈ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ ఎన్నికలు జరుగుతున్నందున రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఏర్పడింది. 2018లో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నించింది. కానీ సాంకేతిక కారణాలతో ప్రక్రియ ముందుకు సాగలేదు. కాగా 909 సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ప్రతీ మండలంలో రెండు సహకార సంఘాలు ఉండాలని ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించింది. 2013లో జరిగిన ఎన్నికల్లో ఎక్కువ శాతం సంఘాలు కాంగ్రెస్‌ ‌గెలుచుకున్నది. గ్రామీణ ప్రాంతాలలో బలమైన రాజకీయ పునాదికి ఈ సంఘాలు ఉన్నందున రాజకీయ పార్టీలు తమ బలాన్ని పటిష్టం చేసుకునేందుకు సహకార సంఘాలపైన దృష్టి సారించాయి. అసెంబ్లీ, పార్లమంట్‌, ‌స్థానికసంస్థలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లను గెలిచి విజయవిహారం చేస్తున్న టీఆర్‌ఎస్‌ ‌సహాకార సంఘాలలో తమ పార్టీ అభ్యర్థుల ఎన్నికల లాంఛనమేనని 900 సంఘాలలో గెలిచి తీరుతామని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ప్రకటించింది. దాదాపు 230 మండలాల్లో ఒకే ఒక్క సహకార సంఘం చొప్పున ఉన్నాయి. సహకారసంఘాలు, డిసిసీబి బ్యాంకులు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక ఉన్నాయని, ప్రస్తుతం ఎన్నికలు 33 జిల్లాల ప్రాతిపదికన జరుగుతున్నాయని, ఇది ఎలా న్యాయసమ్మతమని బీజేపీ ప్రశ్నిస్తున్నది.

ఇక సహకార సంఘాల నుంచి ప్రారంభించి తమ పూర్వ వైభవాన్ని సాధించుకోవాలని కాంగ్రెస్‌ అడుగులు వేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తమ కార్యకర్తలను ఎన్నికలకు కాంగ్రెస్‌ ‌సిద్ధం చేస్తున్నది. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి కరీంనగర్‌, ‌ఖమ్మం జిల్లాలలో సీపీఎం, సీపీలకు వోటర్లు, కార్యకర్తలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలను నిర్మిస్తున్న బీజేపీ తమ క్యాడర్‌ను ఈ ఎన్నికలకు సిద్ధం చేసింది. ప్రతీ సంఘంలో 13 బ్లాకులు ఉంటాయి. అన్నీ బ్లాకులలో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ ‌ప్రణాళికలను రూపొందించింది. ఈ నెల 15న మధ్యాహ్నం వరకు ఎన్నికలు నిర్వహించి సాయంత్రమే ఫలితాలను వెల్లడించనున్నారు. అదేవిధంగా డిసీసీబిలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ప్రతీ జిల్లాలో పట్టు సాధించేందుకు టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ‌బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు సిద్ధమవుతున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!