Take a fresh look at your lifestyle.

కౌలురైతుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి

  • వారికి ఉదారంగా బ్యాంకు రుణాలు ఇవ్వాలి
  • వీరందరికీ కల్టివేటర్స్ ‌రికార్డులు సమకూర్చాం
  • పేదల ఇంటి రుణాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి
  • బ్యాంకర్ల సమావేశంలో సిఎం జగన్‌ ‌వివరణ

అమరావతి,సెప్టెంబర్‌ 9 : ‌కౌలు రైతులకు రుణాలు ఇచ్చే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని బ్యాంకర్లకు ఎపి సిఎం జగన్‌ ‌సూచించారు. ఇప్పటివరకూ 4,91,330 క్రాప్‌ ‌కల్టివేటర్‌ ‌రైట్‌కార్డస్ ‌లను ఇచ్చాం. వీరికి సీసీఆర్‌సీ కార్డులను ఇవ్వడమే కాదు, ఆ డేటాను ఈ-క్రాపింగ్‌లో పొందుపరిచాం. వీరంతా నిజంగా పంటను సాగుచేస్తున్న రైతులు. వీరి విషయంలో బ్యాంకర్లు ముందుకు వచ్చి, వారికి రుణాలు ఇవ్వాలని సీఎం జగన్‌ ‌సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన క్యాంప్‌ ‌కార్యాలయంలో 216వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం జగన్‌ ‌మాట్లాడుతూ.. కోవిడ్‌లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న బ్యాంకులకు ధన్యవాదాలు ప్రకటించారు. గడచిన 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019-20లో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38శాతం తగ్గింది.

మరుసటి ఏడాది అంటే 2020-21లో కూడా కోవిడ్‌ ‌విస్తరణను అడ్డుకోవడానికి లాక్‌డౌన్‌, ఇతరత్రా ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగిందని అన్నారు. దేశ జీడీపీ వృద్ధిరేటు 7.25శాతం మేర పడిపోయింది. మొదటి తైమ్రాసికంలో అయితే 24.43 శాతం మేర జీడీపీ వృద్ధిరేటు పడిపోయింది. ఈ క్లిష్ట సమయంలో బ్యాంకర్ల సహకారం కారణంగా దేశంతో పోలిస్తే ఏపీ సమర్థవంతమైన పనితీరు చూపిందనే చెప్పొచ్చని వివరించారు. 2020-21లో దేశ జీడీపీ 7.25 శాతం మేర తగ్గితే ఏపీలో 2.58 శాతానికి పరిమితమైంది. ఇందులో కీలక పాత్ర పోషించిన బ్యాంకర్లను అభినందిస్తున్నానని సిఎం జగన్‌ అన్నారు. గతేడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే టర్మ్ ‌రుణాలు రూ. 3,237 కోట్లు తక్కువగా నమోదయ్యాయని.. వ్యవసాయరంగానికి 1.32 శాతం తక్కువగా రుణ పంపిణీ ఉన్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. అదే సమయంలో పంట రుణాలు 10.49 శాతం అధికంగా ఇచ్చినట్టు కనిపించడం సంతోషదాయకమని సీఎం జగన్‌ ‌పేర్కొన్నారు. రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం.

విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులను ఇవి ముందుండి నడిపిస్తాయి. ఆర్బీకేల్లోనే ఈ క్రాపింగ్‌ ‌కూడా చేస్తున్నాం. సాగు చేస్తున్న కమతం వద్దే రైతును నిలబెట్టి ఫొటో తీసి, జియో ట్యాగింగ్‌చేసి మరీ ఈ? క్రాపింగ్‌ ‌చేస్తున్నాం. పంటను సాగుచేస్తున్న రైతుకు డిజిటల్‌ ‌రశీదే కాదు, భౌతిక రశీదు కూడా ఇస్తున్నామని సీఎం జగన్‌ ‌తెలిపారు. ఇప్పటికే బ్యాంకర్లు 9,160 ఆర్బీకేలను మ్యాపింగ్‌ ‌చేసి అక్కడ బ్యాంకింగ్‌ ‌కరస్పాండెంట్లను పెట్టాలని నిర్ణయించడమే కాక.. ఇప్పటికే 6,538 కరస్పాండెంట్లను పెట్టడం ప్రశంసనీయం. ఆ బ్యాంకింగ్‌ ‌కరస్పాండెంట్‌ ఆర్బీకేను వినియోగించాలి.. అలాగే బ్యాంకింగ్‌ ‌కరస్పాండెంట్‌ ‌సేవలు ఆర్బీకే వినియోగించుకోవాలి. ఈ-క్రాపింగ్‌ ‌పక్రియలో బ్యాంకింగ్‌ ‌కరస్పాండెంట్‌ ‌భాగం కావాలని అన్నారు.

బ్యాంకింగ్‌ ‌విషయంలో కడప జిల్లాలో 100 శాతం డిజిటలైజేషన్‌ ‌పూర్తిచేశామని చెప్తున్నారు. బ్యాంకింగ్‌ ‌రంగంలో డిజిటలైజేషన్‌ అం‌టే గ్రామాల్లోని ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్‌ ‌బిజినెస్‌ ‌కరస్పాండెంట్లు.. బ్యాంకులుగా మారినప్పుడే డిజిటలైజేషన్‌ ‌దిశగా గొప్ప అడుగు వేసినట్టు చెప్పారు. వ్యవసాయానికి సంబంధించి రుణాలు ఇవ్వడం, ఈ- క్రాపింగ్‌ ‌ద్వారా వారికి రుణాలు ఇవ్వడం.. ఇవన్నీ ఆర్బీకేల్లోని బిజినెస్‌ ‌కరస్పాండెంట్ల ద్వారా చేయాలి. సంపూర్ణ డిజిటలైజేషన్‌కు ప్రతిరూపాలుగా ఆర్బీకేలను బ్యాంకర్లు తీర్చిదిద్దాలని సీఎం జగన్‌ ‌కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్లపట్టాలు రిజిస్టేష్రన్‌చేసి ఇచ్చాం. ఇప్పటికే 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యింది.

మొదటి విడతలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం. ఒక్కో లబ్దిదారునికి కనీసంగా రూ.4-5లక్షల ఆస్తిని సమకూరుస్తున్నాం. ఇంటి నిర్మాణంకోసం కనీసం ఒక్కొక్కరికి రూ.35వేల రుణం ఇచ్చే దిశగా బ్యాంకులు అడుగులు ముందుకేయాలి. దీనివల్ల ఇళ్ల నిర్మాణంలో వారికి తగిన తోడ్పాటు లభిస్తుంది. బ్యాంకులు 3 శాతం వడ్డీకి ఇస్తే, మిగిలిన వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది. దీనిపై బ్యాంకులు చురుగ్గా చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని సిఎం అన్నారు. ఇప్పటి వరకు 9.05 లక్షలమంది చిరువ్యాపారులు జగనన్న తోడు ద్వారా లబ్ది పొందారు. లబ్దిదారులందరికి రూ.10వేల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. దీనిపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ప్రతి ఆరునెలలకు ఒకసారి కొత్తగా దరఖాస్తులు తీసుకోవడంతోపాటు, అందులో అర్హులైన వారికి రుణాలు మంజూరు పక్రియ కొనసాగాలి. దీనిపై బ్యాంకులు దృష్టిసారించాలని అన్నారు.ఎంఎస్‌ఎంఈలకు తోడుగా నిలవాలని బ్యాంకర్లను కోరుతున్నాను. ఒక్కో పరిశ్రమ కనీసం 10 నుంచి 20 మందికి ఉపాధినిస్తున్నాయి. వీరికి తగిన తోడ్పాటు అందించాలని బ్యాంకర్లను కోరుతున్నానని అన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, ‌వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హాజరయ్యారు.

Leave a Reply