Take a fresh look at your lifestyle.

పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు రద్దు

జనవరిలో నేరుగా బడ్జెట్‌ ‌సమావేశాలను నిర్వహించే అవకాశం

- Advertisement -

ఈ ఏడాది శీతాకాల పార్లమెంట్‌ ‌సమావేశాలు నిర్వహించడం లేదు. నోవెల్‌ ‌కొరోనా వైరస్‌ ‌కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శీతాకాల పార్లమెంట్‌ ‌సమావేశాలను రద్దు చేసేందుకు అన్ని పార్టీలు అంగీకరించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషి తెలిపారు. కోవిడ్‌ ‌వ్యాప్తి అడ్డుకునేందుకు నేరుగా జనవరిలో బడ్జెట్‌ ‌సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్‌ ‌నేత అధిర్‌ ‌రంజన్‌ ‌చౌదరీ డిమండ్‌ ‌చేస్తూ లేఖ రాసిన నేపథ్యంలో.. మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషి దీనిపై క్లారిటీ ఇచ్చారు. అన్ని పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపామని, సమావేశాలను రద్దు చేయాలని ఏకగ్రీవంగా అందరూ ఆమోదించినట్లు మంత్రి తెలిపారు.

Leave a Reply