Take a fresh look at your lifestyle.

ఢిల్లీ అల్లర్లపై 11న పార్లమెంట్‌లో చర్చ

ఢిల్లీలో ఇటీవల జరిగిన హింసాకాండపై ఈ నెల 11న పార్లమెంటు చర్చిస్తుంది. కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా ఈ చర్చకు సమాధానం చెబుతారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాకాండలో 53 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ భయానక సంఘటనలపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. హోలీ పండుగకు ముందు ఈ అంశంపై చర్చించేందుకు లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా అంగీకరించకపోవడంపై ప్రతిపక్షాలు నిరసనలకు దిగాయి.

అయితే, ఇటువంటి అంశంపై చర్చించేందుకు ఇది సరైన సమయం కాదని ఓం బిర్లా పేర్కొన్నారు. బడ్జెట్‌ ‌సమావేశాలు రెండో విడత తిరిగి ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్‌ ‌సహా ప్రతిపక్షాలు ఈ అంశంపై చర్చకు పట్టుబడు తున్నాయి. దీంతో ఉభయ సభలు వాయిదాలు పడుతున్నాయి.

Leave a Reply