Take a fresh look at your lifestyle.

నేటినుంచి పార్లమెంట్‌ ‌సమావేశాలు

  • ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
  • రాష్ట్రపతి సమావేశాన్ని బహిష్కరించనున్న బిఆర్‌ఎస్‌

న్యూ దిల్లీ ,ప్రజాతంత్ర,జనవరి30: పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలకు సర్వం సిద్దం అయ్యింది. మంగళవారం నుంచి బడ్జెట్‌ ‌సమావేశాలు జరగునున్నాయి. ఉబయ సభలను ఉద్దేశించి తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిచనున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ముర్ముకు ఇదే తొలిసారి కావడం వివేషం. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్‌ ఇదేకానుంది. అందుకే సమావేశాలు సజావుగా సాగేలాకేంద్రం విపక్షాలకు విజ్ఞప్తి చేసింది. పార్లమెంట్‌ ‌సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో మొదలుకానున్నాయి. ప్రసంగం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను ప్రవేశ పెడతారు. ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌ ‌బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఎన్నికలకు వెళ్లే ముందు ఇదే పూర్తిస్థాయి తుది బడ్జెట్‌ ‌కావడంతో కేంద్రం తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంధన ధరలు, గ్యాస్‌, ‌ప్రయాణ ఛార్జీలు, ఎలక్ట్రి-ఎలక్టాన్రిక్‌ ఉపకరణాలు.. ఇలా ప్రతి వస్తువు ధరా సామాన్యులను అతలాకుతలం చేస్తోంది. దీనికితోడు రుణాలపై వడ్డీరేట్లు భారీగా పెరిగిపోయాయి.

దీంతో ఈఎంఐ భారం పెరిగి చిరుద్యోగి కూడా చిక్కుల్లోపడ్డాడు. మరోవైపు గోరు చుట్టుపై రోకలి పోటులా ఇప్పుడు మాంద్యం భయాలు వెంటాతున్నాయి. భారీగా ఉద్యోగాలూ పోతున్నాయి. ఇలాంటప్పుడు ఖచ్చితంగా ప్రజలు బడ్జెట్‌ ‌నుంచి ఎంతోకొంత ఉపశమనాన్ని ఆశిస్తారు. తానూ మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చానని చెప్పుకుంటున్న నిర్మలా సీతారామన్‌ ఈసారి బడ్జెట్‌లో ఎలాంటి ఊరడింపులు ఇస్తారో  అన్నది చూడాలి. విపక్షాలు సైతం అస్త్రశస్త్రాలతో సిద్దం అవుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏకి పారేసేందుకు సిద్దంగా ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రధానంగా ఎండగట్టనున్నాయి. ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ ‌సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కేసీఆర్‌ ‌దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బిఆర్‌ఎస్‌ ‌పార్టీ నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ ఏ ‌రోజు వ్యూహం ఆ రోజే ఖరారు చేయనున్నారు. ఈ సమావేశంలో బ్జడెట్‌లో కేటాయింపులు, కేంద్రం నుంచి రాష్టాన్రికి రావాల్సిన నిధులు, కేంద్రం నెరవేర్చని విభజన హాలు సహా పలు అంశాలపై చర్చించారు.

Leave a Reply