Take a fresh look at your lifestyle.

దిల్లీ అల్లర్లపై దద్దరిల్లిన పార్లమెంట్‌

‌ప్రధాని, హోం మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాల డిమాండ్‌

ఢిల్లీ అల్లర్లపై సోమవారం పార్లమెంట్‌లో దుమారం చెలరేగింది. ప్రధాని మోదీ, కేంద్ర •ంశాఖ మంత్రి అమిత్‌ ‌షా తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ ‌చేశాయి. విపక్ష సభ్యుల ఆందోళన నడుమ.. ఉభయసభలను రేపటికి వాయిదా వేశారు. ఉదయం ప్రారంభమైన రెండు సభలు.. విపక్షాల నిరసనలతో •రెత్తాయి. ఆ తర్వాత సభలను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అయితే 2 గంటలకు సమావేశమైన ఉభయసభల్లో మళ్లీ అదే సీన్‌ ‌రిపీటైంది. దీంతో సభలను రేపటికి వాయిదా వేశారు. గత వారం ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసను ప్రతిపక్షాలు తీవ్రంగా నిరసిస్తూ..అమిత్‌ ‌షా రాజీనామా డిమాండ్‌ ‌చేయడంతో, బిజెపి కాంగ్రెస్‌ ఎం‌పీలు ఒకరినొకరు నెట్టుకొనే దృశ్యలతో పార్లమెంటు వాయిదాలు పడుతూ వచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పుడు లోక్‌సభ లోపల అమిత్‌ ‌షా రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ కొంతమంది కాంగ్రెస్‌ ఎం‌పీలు భారీ బ్యానర్‌ ‌తీసుకురావడానికి ప్రయత్నించడంతో గొడవ ఇంకా తీవ్రస్థాయికి చేరింది. ‘సేవ్‌ ఇం‌డియా’, ‘ఇక ద్వేషం చాలు’, ‘బిజెపి సర్కార్‌ ‌దంగోంకి సర్కార్‌’ ‘‌ద్వేషపూరిత ప్రసంగాలు ఆపండి’ వంటి నినాదాలు రాసిన ప్లకార్డులను ప్రతిపక్ష సభ్యులు, లోక్‌ ‌సభలో ప్రదర్శించారు. కాంగ్రెస్‌ ‌సభ్యులు బ్లాక్‌ ‌బ్యానర్‌ ‌తీసుకొని ట్రెజరీ బెంచీల దగ్గరకు వెళ్లారు. ‘ప్రజాస్వామ్య దేవాలయం అయిన పార్లమెంట్‌ ‌మర్యాదను ఎంపీలు కాపాడాలి’.. అని స్పీకర్‌ ఓం ‌బిర్లా పదే పదే వ్యాఖ్యానించినప్పటికీ సభలో గందరగోళ పరిస్థితులు కొనసాగాయి.

సభలో ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ సభను కొనసాగించటానికి స్పీకర్‌ ఓం ‌బిర్లా ప్రయత్నిస్తూనే ఉన్నారు. స్పీకర్‌ ‌సభను కొనసాగించటానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్‌ ఎం‌పీలు తమ నిరసన గళాలు గట్టిగా వినిపించడానికి చేసిన ప్రయత్నం వల్ల సభ సజావుగా సాగలేదు. ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలు చూసి బిజెపి సభ్యులు, వెనుక బెంచిల నుండి వెల్‌ ఆఫ్‌ ‌ది హౌస్‌ ‌వైపు పరుగెత్తారు. దీనితో వెల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో లోక్‌సభ వాయిదా వేయడానికి స్పీకర్‌ ‌నిర్ణయించుకున్నారు. గత వారం ఢిల్లీ ఈశాన్య ప్రాంతాలు అయిన జాఫ్రాబాద్‌, ‌మౌజ్‌పూర్‌, ‌బాబర్పూర్‌, ‌చంద్‌ ‌బాగ్‌, ‌శివ విహార్‌, ‌భజన్‌ ‌పురా, యమునా విహార్‌, ‌ముస్తఫాబాద్‌ ‌లో కనీసంగా 46 మంది మరణించారు, 200 మందికి పైగా గాయపడ్డారు.

ఈ విషయంపై కాంగ్రెస్‌, ఆప్‌, ‌లెఫ్ట్, ‌టిఎంసి, ఎస్పీ, బిఎస్పి, డిఎంకె ఎంపీలు ప్రభుత్వం విధి నిర్వహణలో విఫలమయిందని నినాదాలు చేయగా.. రాజ్యసభ కూడా వాయిదా పడింది. ప్రతిపక్ష సభ్యులు నల్ల గుడ్డ కళ్ళ గంతలుగా ధరించి సభలో నిరసన వ్యక్తం చేశారు, డిప్యూటీ చైర్మన్‌ ‌హరివంష్‌ ‌నల్ల గుడ్డ కళ్ళ గంతలు తొలగించమని కోరారు, ఇవి సభా మర్యాదకు వ్యతిరేకం అన్నారు. అయినప్పటికీ, సభ్యులు తమ నిరసన గళాన్ని వినిపించారు.
ఢిల్లీ అల్లర్లపై చర్చను డిమాండ్‌ ‌చేస్తూ సీపీఐ(ఎం) ఎంపీ ఏఎమ్‌ ఆరీఫ్‌ ‌లోక్‌సభలో, కేకే రాగేష్‌ ‌రాజ్యసభలో, సీపీఐ నుంచి బినయ్‌ ‌విశ్వం వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఢిల్లీ అల్లర్ల అంశాన్ని పార్లమెంటులో చర్చించాలని, ఇందుకు దారితీసిన పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. శాంతి భద్రతలు పరిరక్షించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అల్లరి మూకలకు, పోలీసులకు మధ్య సంబంధాలు ఉన్నాయన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇరు సభల సభ్యులు కలిపి మొత్తం 23 మంది పార్లమెంటు సభ్యులు సభను వాయిదా వేసి ఈశాన్య ఢిల్లీ మతహింసపై చర్చ జరపాలని పట్టుబట్టారు.

 

Leave A Reply

Your email address will not be published.