Take a fresh look at your lifestyle.

బుధవారం పార్లమెంట్లో..

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ,మర్చి 17:
తగ్గినా నక్సల్‌ ‌దాడులు :కేంద్ర హోంమంత్రి కిషన్‌ ‌రెడ్డిఆరేండ్లలో నక్సల్‌ ‌దాడులు 47 శాతం తగ్గుముఖం పట్టాయి అని రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర హోంమంత్రి కిషన్‌ ‌రెడ్డి. గడిచిన ఆరేండ్లలో(2014%–%20) నక్సల్‌ ‌ప్రభావిత ప్రాంతాల్లో(ఎల్డబ్ల్యూఈ) ఘటనలు 47 శాతం తగ్గాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. కేందప్రభుత్వంహొ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రహదారుల అనుసంధానం, టెలిఫోన్‌ అనసంధానం, ఆర్థిక సహకారంతోహొ నక్సల్‌ ‌సంబంధిత ఘటనలు తగ్గుముఖం పట్టినట్టు మంత్రి కిషన్‌ ‌రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా నక్సల్‌ ‌ప్రభావిత ప్రాంతాల్లో 3960 కి. మీ రోడ్లు వేసినట్టు ఆయన తెలిపారు. మొబైల్‌ ‌టవర్‌ ‌ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో 2,335 మొబైల్‌ ‌టవర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రెండోదశలో మరిన్ని టవర్లు వేయనున్నట్టు వెల్లడించారు. దీంతోపాటూ దేశవ్యాప్తంగా ఉన్న 30 ఎల్‌ ‌డబ్యూడీ జిల్లాల్లో 1,170 బ్యాంక్‌ ‌బ్రాంచ్లు, 959 ఏటీఎంలు స్థాపించినట్టు వివరించారు. 12,628 బ్యాంకింగ్‌ ‌కరస్పారెండ్లను గత ఐదేండ్లలో నియమించినట్టు వివరించారు. 2009తో పోల్చితే 2020లో ఎల్డబ్యూఈ ఏరియాల్లో 70 శాతం హింసాత్మక ఘటనలు తగ్గాయని పేర్కొన్నారు. 2009 లో అత్యధికంగా 2258 ఘటనలు జరుగగా, 2020 లో ఆ సంఖ్య 665 కు పడిపోయిందని తెలిపారు. అలాగే, 2010 లో 1, 005 మంది సివిలియన్స్, ‌సెక్యూరిటీ ఫోర్సెర్స్ అమరులైతే, 2020 లో కేవలం 183 మంది ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. మొత్తంగా 82 శాతం మరణాలు తగ్గాయని వెల్లడించారు. 2009 నుంచి14 వరకు ఆరేండ్ల కాలంలో జరిగిన హింసాత్మక ఘటనలతో పోల్చేతే, 2014%–%20 మధ్య ఆరేండ్లకాలంలో దాదాపు 47 శాతం ఘటనలు తగ్గుముఖం పట్టినట్టు తెలిపారు. రాజ్య సభలో ఎంపీ బ్రిజ్‌ ‌లాల్‌ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం ఇచ్చారు.
అత్యున్నత కోర్టుల్లో జడ్జిల కొరత:న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ‌ప్రసాద్‌
‌దేశవ్యాప్తంగా అత్యున్నత కోర్టుల్లో 419 జడ్జిల కొరత నెలకొని ఉంది. సుప్రీంలో నాలుగు హైకోర్టుల్లో 415 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ హైకోర్టులో 10 న్యాయమూర్తి పోస్టుల వెకెన్సీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 25 హైకోర్టులుల్లో 415 జడ్జిల పోస్టులు ఖాళీలు ఉన్నట్టు కేంద్ర న్యాయ శాఖ వెల్లడించింది. భారత సర్వోన్నత న్యాయస్థానంలో నాలుగు ఖాళీలు ఉన్నాయని స్పష్టం చేసింది. బుధవారం లోక్‌సభలో జోత్న చరణ్‌దాస్‌ ‌మహంతి అడిగిన ప్రశ్నకి కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ‌లిఖిత సమాధానం ఇచ్చారు. దేశంలోని అన్ని హైకోర్టులు, సుప్రీంకోర్టులో మొత్తం 1080 పోస్టుల అవసరం ఉంటే కేవలం 661 న్యాయమూర్తిలను మాత్రమే భర్తీ చేసినట్టు వెల్లడించారు. మొత్తంగా 419 జడ్జిల పోస్టులు ఖాళీ ఉండగా అందులో హైకోర్టులు 415, సుప్రీంకోర్టులో నాలుగు ఖాళీలు ఉన్నట్టు తెలిపింది. తెలంగాణ హైకోర్టులో 24 మంది జడ్జిలు అవసరం ఉండగా కేవలం 14 మంది మాత్రమే ఉన్నారని, మరో పది జడ్జి పోస్టుల భర్తీ చేయాల్సి ఉందని కేంద్రం తెలిపింది. గత మూడు సంవత్సరాల్లో కేవలం నాలుగు జడ్జి పోస్టులను హైకోర్టులో భర్తీ చేసినట్టు వివరించింది.హొ విభజిత ఆంధప్రదేశ్‌ ‌హైకోర్టులో మొత్తం 37 పోస్టులు ఉండగా 19 మంది జడ్జిలు ఉన్నారని, మిగతా 18 జడ్జి పోస్టులు ఖాళీలు ఉన్నట్టు వివరించింది. గడిచిన మూడు సంవత్సరాల్లో తొమ్మిది జడ్జి పోస్టులను భర్తీ చేసినట్టు న్యాయ శాఖ వెల్లడించింది. దేశంలో అత్యధికంగా అలహాబాద్‌ ‌హైకోర్టులో ఖాళీలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఆ కోర్టులో 160 పోస్టులు అవసరం కాగా, కేవలం 96 పోస్టులు మాత్రమే భర్తీ చేయగా 64 పోస్టుల ఖాళీలు ఉన్నట్టు చెప్పింది.హొ హైదరాబాద్‌, ‌వరంగల్‌ ‌నగరాలకిహొ హొ‘నర్చరింగ్‌ ‌నైబర్‌హుడ్స్’ ‌లో స్థానంనర్చరింగ్‌ ‌నైబర్‌హుడ్స్ ‌ఛాలెంజ్‌ ‌లో హైదరాబాద్‌, ‌వరంగల్‌ ‌నగరాలకి స్థానం కల్పించినట్టు తెలిపిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. దేశవ్యాప్తంగా చిన్నపిల్లలు వారి సంరక్షణ ఆరోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ‘ది నర్చరింగ్‌ ‌నైబర్‌హుడ్స్ ‌ఛాలెంజ్‌’‌ను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనేందుకు అన్ని స్మార్ట్ ‌సిటీలు, అన్ని రాజధాని నగరాలు, ఐదు లక్షలకుపై జనాభా ఉన్న నగరాలకు అవకాశం ఇచ్చారు. దరఖాస్తుల్లో పాల్గొన్న నగరాల్లోని 25 నగరాలను ఈ ఛాలెంజ్‌ ‌పైలట్‌ ‌దశలో పాల్గొనేందుకు ఎంపిక చేశారు. ఇందులో ఆంధప్రదేశ్‌లోని కాకినాడ, తెలంగాణలోని హైదరాబాద్‌, ‌వరంగల్‌ ‌నగరాలను ఎంపిక చేసినట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌ ‌సింగ్‌ ‌పురీ రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ ఎం‌పీ లింగయ్య యాదవ్‌ ‌ప్రశ్నకు లిఖితపూర్వకహొ జవాబు ఇచ్చారు
 దేశమంతా వన్‌ ‌నేషన్‌-‌వన్‌ ‌గ్యాస్‌ ‌గ్రిడ్‌
త్వరలో దేశమంతా వన్‌ ‌నేషన్‌-‌వన్‌ ‌గ్యాస్‌ ‌గ్రిడ్‌ అం‌దుబాటులోకి రానుంది.18,400 కి.మీ పొడవైన గ్యాస్‌ ‌పైప్‌లైన్లు పనిచేస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేందప్రదాన్‌ ‌తెలిపారు. దేశవ్యాప్తంగా ‘వన్‌ ‌నేషన్‌%–%‌వన్‌ ‌గ్యాస్‌ ‌గ్రిడ్‌’ ఏర్పాటు చేయాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్రం తెలిపింది. దేశంలో సహజవాయు వినియోగాన్ని పెంచడం కోసం నేచురల్‌ ‌గ్యాస్‌ ‌గ్రిడ్‌పై దృష్టి సారించామని బుధవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ ‌ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌లిఖిత సమాధానం ఇచ్చారు. పెట్రోలియం అండ్‌ ‌నేచురల్‌ ‌గ్యాస్‌ ‌రెగ్యులేటరీ బోర్డ్ ‌గ్యాస్‌ ‌పైప్‌లైన్ల అంశాన్ని ఆమోదిస్తుందని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 18,400 కి.మీ పొడవైన గ్యాస్‌ ‌పైప్‌లైన్లు పనిచేస్తున్నాయని, మరో 16,100 గ్యాస్‌ ‌పైప్‌లైన్‌ ‌పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయని కేంద్రమంత్రి వెల్లడించారు. బోర్డ్ ఆమోదం మేరకు ఉన్న గ్యాస్‌ ‌పైప్‌లైన్లను అనుసంధానించడం, విస్తరించడం వంటి పనులు జరుగుతాయని స్పష్టం చేశారు.

Leave a Reply