Take a fresh look at your lifestyle.

ఎపిలో ముగిసిన పరిషత్‌ ఎన్నికల సమరం

  • టిడిపి బరిలో లేకపోవడంతో ఓటర్ల అనాసక్తి
  • 50శాతం వరకు పోలింగ్‌ ‌జరిగినట్లు అంచనా
  • వైసిపికి అనుకూలంగా ఏకపక్షంగా సాగిన ఓటింగ్‌
  • ‌స్ట్రాంగ్‌ ‌రూములకు బ్యాలెట్‌ ‌బాక్సుల తరలింపు

ఎపిలో పరిషత్‌ ఎన్నికల సమరం ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రి 5ంటల వరకు పోలింగ్‌ ‌నిర్వహించారు. క్యూలైన్‌లో ఉన్న వారికి చివరి వరకు అవకాశం కల్పించారు. విజయనరంలో అత్యధికంగా, ప్రకాశంలో అత్యల్పంగా పోలింగ్‌ ‌జరిగినట్లు సమాచారం. అయితే పోలింగ్‌ ‌లెక్కలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బ్యాలెట్‌ ‌బాక్సులను భద్రత మధ్య స్ట్రాంగ్‌ ‌రూములకు తరలించారు. హైకోర్తు తీర్పు తరవాతనే కౌంటింగ్‌ ‌చేపడతారు. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42 శాతం పోలింగ్‌ ‌నమోదైంది.శ్రీకాకుళం జిల్లా-46.46 శాతం, విజయనగరం జిల్లా-56.57 శాతం,విశాఖ జిల్లా- 55.29 శాతం,తూర్పు గోదావరి- 51.64 శాతం, పశ్చిమగోదావరి జిల్లా-55.4 శాతం,కృష్ణా జిల్లా-49 శాతం, గుంటూరు జిల్లా- 37.65 శాతం,ప్రకాశం జిల్లా- 34.19 శాతం,నెల్లూరు జిల్లా -41.8 శాతం,చిత్తూరు జిల్లా-50.39 శాతం, కపడ జిల్లా- 43.77 శాతం, కర్నూలు జిల్లా-  48.40శాతం,అనంతపురం జిల్లా: 45.70 శాతం నమోదయినట్లు తెలుస్తోంది. ఇకపోతే చెదురు ముదురు ఘటనల నేపథ్యంలో పోలింగ్‌ ‌ప్రశాంతంగా ముగిసింది. బరిలో ప్రధాన ప్రతిపక్షం టిడిపి లేకపోవడంతో ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపనట్లు అర్థం అవుతోంది.గుంటూరుజిల్లా అచ్చంపేట మండల పరిధిలోని అచ్చంపేట గ్రామం 3 ఎంపిటిసి పోలింగ్‌ ‌కేంద్రమైన నీలేశ్వర పాలెం గ్రామంలో రిగ్గింగ్‌ ‌జరిగినట్లు సమాచారం. తమ ఓట్లు వేయలేదు అంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పోలింగ్‌ ‌సిబ్బంది. సుమారు 400 జెడ్‌ ‌పి టి సి ఓట్లు, 360 ఎంపీటీసీ ఓట్లు ఎటువంటి సంతకాలు లేకుండా పోలింగ్‌ ‌బాక్స్‌లో వేసినట్లు సమాచారం. పోలింగ్‌ ‌బూత్‌ ‌వద్ద ఒక కానిస్టేబుల్‌, ‌సచివాలయం మహిళా పోలీస్‌ ‌మాత్రమే విధుల్లో ఉన్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు పోలింగ్‌ ‌వద్దకు చేరుకొని పోలింగ్‌ ‌నిలిపివేయకుండా యథాతథంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం వుయ్యందన గ్రామంలో అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. బ్యాలెట్‌ ‌నమూనాలో ఫ్యాన్‌ ‌గుర్తుపై ముద్ర వేసుకున్నారు. న్యూస్గురువారం మండల ప్రాదేశిక జిల్లాపరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. చివరి ఘట్టలో పర్రెడ గ్రామంలో నివాసం ఉంటున్న వికలాంగుడు మండుటెండలో కూడా లెక్క చేయండా కుటుంబ సభ్యులు సహాయంతో వచ్చి ఓటు వేశాడు.  విజయనగరం జిల్లా లోఆంధ్రా- ఒడిశా సరిహద్దు కొఠియా గ్రామాల్లో పోలీసులు, నేతలను ఎదిరించి గిరిజనులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పట్టుచెన్నూరు, పగలు చెన్నూరు, గంజాయిభద్రతో పాటు ఏవోబీ సరిహద్దు గ్రామాల్లో ఓటర్లు తమ ఓటు వినియోగించుకున్నారు. సీతానగరం మండలం అంటిపేటలో పోలింగ్‌ ‌నిలిచింది. బ్యాలెట్‌ ‌పేపర్‌లో తప్పులు ఉండటంతో పోలింగ్‌ ‌రేపటికి వాయిదా పడింది. పేరు మార్పు గందరగోళంతో పోలింగ్‌ ‌నిలిచింది. ప్రకాశం జిల్లాతాళ్లూరు మండలం శివరాంపురంలో ఉద్రిక్తత నెలకొంది. దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్‌ ‌సోదరుడు రవీంద్ర వాహనంపై రాళ్లదాడి చోటుచేసుకుంది. రవీంద్ర వాహనం పై వైసీపీ రెబల్స్ ‌రాళ్లదాడి చేయడంతో పోలీసులు చెదరగొట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో అధికారులు పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. వేసవి నేపథ్యంలో పోలింగ్‌ ‌కేంద్రం వద్ద ఓటర్లు ఇబ్బందులు పడకుండా అధికారులు సదుపాయం కల్పించారు. టెంట్లు వేయడంతో పాటు వాటర్‌ ‌ప్యాకెట్లు ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు. మండలంలో ఉదయం 7 గంటల నుండే సందడి మొదలైంది. 9 గంటల నుంచి ఓటర్లు బారులు తీరారు.

మండుటెండను కూడా లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్‌లో పాల్గన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొత్తూరు ప్రాథమిక పాఠశాల, పెనుమంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాల, కొడమంచిలి జడ్పీ ఉన్నత పాఠశాల, వల్లూరు పంచాయతీ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకట్రావు సహాయ ఎన్నికల అధికారులు ఎం శ్రీనివాసరావు మధుసూదన్‌ ‌రావు రాజశేఖర్‌ ‌పోలింగ్‌ను పర్యవేక్షించారు. శ్రీకాకుళం జిల్లా  సంతబొమ్మాళి మండలంలోని వడ్డివాడ గ్రామంలో ఎంపిటిసి ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పిఒ కర్రి కమల కుమారి (45) ఒక్కసారిగా స్పఅహ తప్పి పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్న వైద్య సిబ్బంది ఆశావర్కర్లు తాత్కాలిక ప్రథమ చికిత్స అందించారు. తరువాత దండుగోపాలపురం వైద్యాధికారి డాక్టర్‌ ‌వంశీకృష్ణ వైద్యపరీక్షలు నిర్వహించారు. కొంత సమయం పర్యవేక్షణలో ఉన్న తర్వాత తిరిగి విధుల్లో హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం సురవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్‌ ‌బూతులో వైసిపి కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడు తుండడంతో టిడిపి మహిళా అభ్యర్థి బూతు లోపలే బైఠాయించారు. గుంటూరు జిల్లా సతైనపల్లి మండలం పణిదంలో మధ్యాహ్నం 12గంటలు దాటినా ఓటర్లు రాకపోవడంతో పోలింగ్‌ ‌కేంద్రాలు వెలవెలబోయాయి. కర్నూలు జిల్లా వెలుగుడు పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వెలుగుడు పట్టణంలోని 5,6 పోలింగ్‌ ‌బూతులో వైసిపి, ఎస్‌డిపిఐ ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరుపార్టీల ఏజెంట్లు మధ్య తోపులాట చేసుకుంది. అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.  కంచికచర్ల మండలం పేరకలపాడు పోలింగ్‌ ‌కేంద్రం వద్ద ఓ వృద్ధురాలు తన ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో వైసిపి, టిడిపిలకు చెందిన కార్యకర్తల మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. ఆమె ఓటు తమదంటూ ఇరు పార్టీలకు చెందిన వారు గొడవపడ్డారు. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని వారించారు. కంచికచర్ల పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేశారు.  నెల్లూరు జిల్లా  తాళ్లూరు మండలం శివరాంపురంలో ఉద్రిక్తత నెలకొంది.

ఎమ్మెల్యే మద్దిశెట్టి సోదరుడు ఓటు వేసేందుకు పోలింగ్‌ ‌కేంద్రానికి వెళ్లారు. పోలింగ్‌ ‌కేంద్రం వద్దనే స్వతంత్ర అభ్యర్థులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే సోదరుడి కారు అద్దాలను ధ్వంసం చేశారు. నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. టిడిపి, వైసిపి నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఆరుగురికి గాయాలవ్వగా, వారిని ఆసుపత్రికి తరలించారు.  చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగం పేటలో హీరో మంచు విష్ణు ఓటేశారు.   కడప జిల్లా.. చాపాడు మండలం రాజువారిపేట పోలింగ్‌ ‌కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి రాజేశ్వరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాలెట్‌ ‌పేపర్‌ ‌బయటకు తీసుకురావడంతో పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.

Leave a Reply