Take a fresh look at your lifestyle.

చంద్రయాన్‌ ‌విఫలంతో నిద్రపట్టలేదు

pariksha pe charcha 2020, pm modi, chandrayaan2, kapil sinbhaal

  • ఓటమి నుంచి విజయం చేకూరుతుంది
  • పరీక్షాపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ
  • పరీక్షా సమయంలో చర్చేంటి : కాంగ్రెస్‌ ‌నేత సిబాల్‌

‌న్యూఢిల్లీ: చంద్రయాన్‌-2 ‌విక్రమ్‌ ‌ల్యాండర్‌ ‌సాంకేతిక కారణాలతో విఫలమైన రోజు తనకు నిద్ర పట్టలేదని ప్రధాని మోదీ చెప్పారు. ఆ రాత్రి నిద్రపోలేదని పేర్కొన్నారు. విద్యార్థులకు పరీక్షల కాలం సపిస్తుండటంతో మోదీ సోమవారం ’పరీక్ష పే చర్చా’ కార్యక్రమం నిర్వహించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో 2 వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ విద్యార్థులతో మాట్లాడుతూ.. చంద్రయాన్‌-2 ‌లాంచ్‌ ‌మిషన్‌ను వీక్షించేందుకు వెళ్లవద్దని తనకు పలువురు సూచించారు. అది విజయవంతం అవుతుందనే నమ్మకం లేదని.. విఫలమైతే పరిస్థితి ఎలా ఉంటుందోనని వారు అన్నారు. కానీ నేను మాత్రం ఇస్రోకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను. అయితే విక్రమ్‌ ‌ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పిన తరువాత.. నేను అక్కడి నుంచి •టల్‌కు వెళ్లిపోయాను. కానీ ఈ పరిణామంతో అసంతృప్తి చెందలేదు. ఆ తర్వాత పీఎంవో అధికారులును పిలిచి ఇస్రో శాస్త్రవేత్తలతో రేపు ఉదయం సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా సూచించాను. వెంటనే తన షెడ్యూల్‌ను మార్చవల్సిందిగా పీఎంవో బృందాన్ని ఆదేశించాను. మరుసటి రోజు ఉదయమే శాస్త్రవేత్తలతో భేటీ అయ్యాను. ఈ సందర్భంగా చంద్రయాన్‌-2 ‌కోసం కష్టపడిన శాస్త్రవేత్తల శ్రమను అభినందించాను. నా భావాలను వారితో పంచుకున్నాను. ఈ ఘటన ఓటమి నుంచి గెలుపు పాఠాలు నేర్పిందన్నాను. రాబోయే రోజుల్లో భారీ విజయాలు సాధించవచ్చని చెప్పాను. మనం అనుకున్న విధంగా చంద్రుని ఉపరితలాన్ని చేరుకోలేపోయాం.. కానీ దీనిని ఓ కవి మాత్రం చంద్రున్ని తాకలానే తాపత్రాయంతో విక్రమ్‌ ‌ల్యాండర్‌ ‌వేగంగా దూసకెళ్లిందని అభివర్ణించారు’ అని తెలిపారు. పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానం ఇచ్చారు. వారిలో ఆత్మస్థయిర్యం నింపే ప్రయత్నం చేశారు. పరీక్షలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు.

పరీక్షా సమయంలో చర్చేంటి: సిబాల్‌
అయితే విద్యార్థులకు ఇది పరీక్షల సమయమని, ప్రస్తుతం వారిని ఒంటరిగా వదిలేయమని ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి కాంగ్రెస్‌ ‌నేత, ప్రముఖ లాయర్‌ ‌కపిల్‌ ‌సిబాల్‌ ‌సూచించారు. ’పరీక్షా పే చర్చా 2020’ అనే కార్యక్రమం ద్వారా ప్రధాని ఈరోజు విద్యార్థులతో సమావేశయ్యారు. అయితే దీనిని ఉద్దేశించే మోదీకి సిబాల్‌ ఈ ‌విధంగా వ్యాఖ్యానించారు. విద్యార్థులు బోర్డ్ ‌పరీక్షలకు సిద్ధమవుతున్నారని ఇలాంటి సమయంలో వారి సమయాన్ని వృధా చేయరాదని సిబాల్‌ ‌పేర్కొన్నారు. దీనికి బదులు డిగ్రీలు చదివిన వారితో చర్చలు చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నేను ఓ సలహా చేయదల్చుకున్నాను. విద్యార్థులు ప్రస్తుతం బోర్డ్ ‌పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో వారికి మరింత స్వేచ్ఛా సమయాన్ని కేటాయించడం అవసరం. విద్యార్థుల సమయాన్ని వృధా చేయకుండా, ప్రధాన మంత్రి వారిని ఒంటరిగా వదిలేస్తే బాగుంటుంది. దీనిక బదులు డిగ్రీలు ఉత్తీర్ణులైన వారితో ప్రధాని చర్చలు చేయడం చాలా అవసరం. ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. ఆయన ‘మన్‌ ‌కీ బాత్‌’‌లో కూడా ఈ విషయంపై జరగాలి’ అని సిబాల్‌ అన్నారు.

Tags: pariksha pe charcha 2020, pm modi, chandrayaan2, kapil sinbhaal

 

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply