Take a fresh look at your lifestyle.

తూకాల్లో మోసం .. న్యాయం చేయాలంటూ రైతన్నల ఆందోళన

పరిగి నియోజకవర్గ పరిధిలోని దోమ మండలం పాలెపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రం వద్ద నిరసన తెలుపుతున్న రైతులు

తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లుగా మారిపోయింది రైతన్న పరిస్థితి. యెన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుని పంట చేతికొచ్చి తీరా దాన్యం అమ్ముకునే సమయంలో తన నోటికందే ముద్దను కాకి తన్నుకుపోయినట్లుగా దాన్యం విక్రయాల సమయంలో కొనుగోలు దారులు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ రైతులను మోసం చ్ఱెస్తున్నారు. పరిగి నియోజకవర్గ పరిధిలోని దోమ మండలం పాలెపల్లి గ్రామంలో ఐకెపి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో తూకాల్లో తేడా రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చ్ఱెస్తున్నారు. ఒక సంచి తూకంలో 1.5 కిలోల ధాన్యాన్ని ఎక్కువగా తూచడంతో రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ఇలా జరుగుతుండడంతో పలువురు అధికారుల పని తీరుపై అసహనం వ్యక్త పరుస్తున్నారు. కావున అధికారులు ఇప్పటికైనా స్పందించి రైతులకు న్యాయం జరిగ్ఱెలా చూడాలని పలువురు కోరుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!