Take a fresh look at your lifestyle.

జీవితానికి సార్థకత వెలుగులు తల్లిదండ్రులు

మన భారతదేశం సువిశాలమైన ప్రకృతి అందాలకు, పర్వతాలకు,నదులకు, జీవరాశులకు పుట్టినిళ్లు. ఎన్నో వైవిధ్యమైన సంస్కృతులకు, సంప్రదాయాలకు పెట్టింది పేరు భారతదేశం. ప్రపంచదేశాలు సైతం మన రామాయణ, భాగవత, భగవద్గీత గ్రంథాలను ఆదరించి అందులో నిర్లీప్తం అయిన విలక్షణమైన విషయాలను ఆశ్రయించి ఆచరించారు.వేదాల్లో సైతం ఎన్నో విషయాలు,విలువలు ఉండటం మన భారతీయులు చేసుకున్న గొప్ప పుణ్యం. ఎన్నో విభిన్నమైన విశిష్టతలు ఉన్న అతి ప్రధానమైనది జన్మనించిన తల్లిదండ్రులను ఆరాధించడం,వారి పట్ల పూజ్యానీయ భావన కలిగి ఉండటం.కానీ మారుతున్న వైజ్ఞానికతతో పాటు,అభివృద్ధి చెందుతున్న ఆర్థిక స్థితిగతులతో పాటు ప్రతి మనిషి విపరీతమైన ఆలోచనల మరియు ఆశల ముందు తల్లిదండ్రులను పూర్తి స్థాయిలో పట్టించుకూనే వారు ఉన్నారా? అనేది ప్రతి ఒకరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశం.

ప్రతి మనిషికి ఈ ప్రపంచాన్ని పరిచయం చేసిన మొట్టమొదటి బడి తల్లిఒడి అయితే మనకంటూ ఒక గుర్తింపును తీసుకొచ్చి,వ్యక్తిత్వనిర్మాణాన్ని అందించిన చిరునామా నాన్న.ఎన్నో కష్టాలకు,నష్టాలకు ఓర్చి వారి ప్రతి రక్తపు బోట్టును చెమట చుక్కలుగా మార్చి కన్న వాళ్ల ఎదుగుదలకు,ఉన్నతికి అనునిత్యం శ్రమించిన అమ్మనాన్నను పట్టించుకొని పట్టేడు అన్నం పెట్టి వారి ప్రశాంతతకు బాటలు వేసే కొడుకులు, కూతుళ్లు ఎంత మంది ఉన్నారు?మితిమీరిన పోకడలతో గతి తప్పిన ఆలోచనలతో తమ తమ ఎదుగుదల మీద ఉన్న శ్రద్ధ తల్లిదండ్రులను ఆదరించే విషయాలపై లేదానేది చాలా వరకు వాస్తవం. తల్లిదండ్రులను అవసరానికి వాడిపడేసే వస్తువులుగా చూసే రోజుల్లో మనం ఉన్నామనడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేకపోలేదు. నేటి సమాజంలో నలుగురు కొడుకులు ఉన్న కుటుంబాలలో తల్లిదండ్రులను సాధుకపు జీవులుగా ఒక్కొక్కరికి నెల చొప్పున ఆలనపాలన చూసుకునే దౌర్భాగ్యం దాపరించింది.తల్లిదండ్రులకు వచ్చే పెన్షన్‌ ‌లకు ఆశపడే కొడుకులు ఉండే దుస్థితి కూడా నేడు కళ్లముందు కదలడుతుంది.

బహుళ అంతస్థుల్లో బహు చక్కని ఆనందపు జీవితాన్ని అనుభవించే కొడుకులు అమ్మ,నాన్నలను మాత్రం వృద్ధాశ్రమాలకు పయానం కడుతున్నారు. నాడు చిన్న తనంలో పిల్లల చేసే ప్రతి పనికి ఓపికతో,ఓర్పుతో,కొండంత సహనంతో భరించి అల్లరుముద్దుగా పెంచి విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో మనకంటూ గౌరవాన్ని,విలువను అందించిన తల్లిదండ్రులను వృద్ధాప్యం లో కానరాకుండా ఉండటం దారుణం. పురాణాల్లో శ్రవణకుమారుడు లాంటి కొడుకులు కరువయ్యే తల్లిదండ్రులు బ్రతికుండగానే ప్రతిక్షణం మానసికంగా,శారీరకంగా వేధించి బాధపెట్టే కుమారులు లెక్కలేనంత మంది ఉన్నారని చెప్పవచ్చు. తల్లిదండ్రులను ప్రాణం ఉన్నంత వరకూ ప్రాణంలా చూసుకునే కొడుకులు,కూతుళ్లు కూడా ఉన్నారు.అలాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి.తల్లిదండ్రుల సేవ జీవితానికి ఒక సార్థకత అదే మనిషిగా మన ప్రధాన లక్షణం. తల్లిదండ్రుల క్షేమం మరిచిన క్షణం మరణించడం సుఖం అనేది నా భావన.తల్లిదండ్రుల పట్ల అశ్రద్ధ,నిర్లక్ష్య భావన జీవితానికి తర్వాతి తరాలకు తీరాని ఆవేదనగా,అసంతృప్తిగా వెంటాడు తుంది.కావున తల్లిదండ్రులను గౌరవిద్దాం, ఆరాధిద్దాం, ఆదరిద్దాం.
– బండి వంశీకృష్ణ గౌడ్‌
‌రంగయ్యపల్లి, రేగొండ
జయశంకర్‌ ‌జిల్లా, 9550837962

Leave a Reply