Take a fresh look at your lifestyle.

ఆన్‌లైన్‌ ‌విద్యా విధానంలో తల్లిదండ్రుల బాధ్యత కీలకం

“తరగతి గదిలో శ్రద్దగా కూర్చుని పాఠాలు వినే రోజులు పోయి, కంప్యూటర్‌ ‌స్క్రీన్‌ ‌లను చూస్తూ, మొబైల్‌ ‌ఫోన్లలో ఆన్‌ ‌లైన్‌ ‌పాఠాలతో చదివే పరిస్తితి వస్తుందని ఎవరూ ఊహించక పోవచ్చు, విద్యావిధానంలో చోటుచేసుకున్న పరిణామాలను తల్లిదండ్రులు, విద్యార్థులు. ఉపాద్యాయులు అర్థం చేసుకొని, అందుకు తగ్గట్లుగా ముందుకు దూసుకెళ్లడం సవాలే కావచ్చు కానీ అసాధ్యమైందేమీ  కాదు. ఆన్‌ ‌లైన్‌ ‌విద్యావిధానం తో సత్ఫలితాలు ఇస్తాయో ఇవ్వవో కానీ ప్రస్తుతం ప్రత్యక్ష బోధన ప్రారంభం అయ్యేంత వరకు పిల్లలు విద్యకు దూరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పై ఉంది.”

కోవిడ్‌ – 19 ‌మహమ్మారి ప్రతి ఒక్కరినీ తీవ్రంగా దెబ్బతీస్తోంది. అన్నీ రంగాలు అతలాకుతలం అయ్యాయి. ఇక విద్యారంగం పరిస్తితి ఆగమ్య గోచరంగా తయారయ్యింది. పాఠశాల అనేది భవిష్యత్తు రూపుదిద్దుకునే ప్రదేశం. దేశ భవిష్యత్తు తరగతిలోనే రూపు దిద్దుకుంటుంది అనేది అక్షర సత్యం. ప్రపంచ వ్యాప్తంగా 188 దేశాలలో 91 శాతం మంది విద్యార్థులు ఇంటికే పరిమితం అయ్యారు .1.5 బిలియన్‌ ‌విద్యార్థులు తరగతి గదికి దూరంగా ఉంటున్నారు అని హ్యూమన్‌ ‌రైట్స్ అం‌టోంది. తరగతి గదిలో శ్రద్దగా కూర్చుని పాఠాలు వినే రోజులు పోయి, కంప్యూటర్‌ ‌స్క్రీన్‌ ‌లను చూస్తూ, మొబైల్‌ ‌ఫోన్లలో ఆన్‌ ‌లైన్‌ ‌పాఠాలతో చదివే పరిస్తితి వస్తుందని ఎవరూ ఊహించక పోవచ్చు, విద్యావిధానంలో చోటుచేసుకున్న పరిణామాలను తల్లిదండ్రులు, విద్యార్థులు. ఉపాద్యాయులు అర్థం చేసుకొని, అందుకు తగ్గట్లుగా ముందుకు దూసుకెళ్లడం సవాలే కావచ్చు కానీ అసాధ్యమైందేమీ  కాదు. ఆన్‌ ‌లైన్‌ ‌విద్యావిధానం తో సత్ఫలితాలు ఇస్తాయో ఇవ్వవో కానీ ప్రస్తుతం ప్రత్యక్ష బోధన ప్రారంభం అయ్యేంత వరకు పిల్లలు విద్యకు దూరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పై ఉంది.

సబ్జెక్టు ఉపాధ్యాయులతో టచ్‌ ‌లో ఉండాలి: ఎలాగూ పాఠశాలలు పున: ప్రారంభం కాలేదు కదా అని పుస్తకాలకు పిల్లలు దూరంగా ఉండకుండా ప్రస్తుత తరగతి పుస్తకాలు అందుబాటులో ఉంటే వాటిని చదవడం ప్రారంభించాలి. చాప్టర్‌ ‌ప్రారంభించే కంటే ముందుగా సబ్జెక్ట్ ఉపాద్యాయుడితో మాట్లాడి కొంత విషయాన్ని ముందుగానే సేకరించుకోవాలి. గత తరగతి పుస్తకాలలో ఆ చాప్టర్‌ ‌కు సంబందించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఈ సంవత్సరం పుస్తకాలలోని చాప్టర్‌ ‌లను మొదలు పెట్టండి. సందేహాలు ఉంటే సబ్జెక్ట్ ఉపాద్యాయులతో చర్చించడము లేదా సీనియర్స్ ‌తో షేర్‌ ‌చేసుకోవాలి. ఇదే పూర్తిగా సబ్జెక్ట్ అం‌తా నేర్చుకుంటారని కాదు కానీ ఖాళీ సమయాన్ని వినియోగించుకుంటూ గత సంవత్సరం విషయాలు గుర్తుకు చేసుకోవడం జరుగుతుంది.

జీవన నైపుణ్యాలు, విలువల విద్య పై దృష్టి పెట్టండి: కరోన విజృంబిస్తున్న ప్రస్తుత సమయం లో దొరికిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచనలు చేయాలి. పిల్లలకు సాధారణం గా ప్రతి రోజు పాఠ్యపుస్తకాలను చదవమని అంటే విసుగు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఆ సమయంలో జీవన నైపుణ్యాలు, సమాజం, విలువల విద్య పై దృష్టిని సారించాలి. మంచి చెడు విషయాలపై అవగాహన కలిపించడం, జీవితం విలువ నేర్పడం లాంటివి చేయాలి. సమాజంలో ఎలా బతకాలో నేర్పించాలి. జీవితంలో బాగు పడటానికి కరోన ఖాళీ సమయాన్ని వినియోగించుకోవాలి.

సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాల్సిందే: ఎలాగూ విద్యా సంవత్సరం ప్రారంభమే కాలేదు కదా ఇంట్లో ఊరికే కూర్చొని ఉంటే సోమరి తయారు అవుతారు. ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే పిల్లలు చురుకుగా తయారవుతారు. పరిస్థితులకు తగ్గట్లుగా మారాల్సిందే నేను మారను అంటే అవివేకిగా సమాజం గుర్తిస్తుంది. అందుబాటులో ఉన్న అన్నీ సౌకర్యాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ అభ్యసనం కొనసాగించాల్సిందే. అభ్యసనం నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. ఇలాంటి  ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆన్లైన్‌ ‌విద్యావిధానం ద్వారా పిల్లలు నేర్చుకోవాలనే తపనను కొనసాగించడానికి అవకాశం ఉంటుంది.

ఒత్తిడి లేని ఆన్లైన్‌ ‌విద్యా విధానం సూచనలు :
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో రెండు , మూడు  నెలల వరకు తరగతులు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే సూచనలు లేవు. ఇన్ని రోజుల పాటు పిల్లలు పూర్తిగా చదువుకు దూరమైతే తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్తితి ఏర్పడనుంది. కోవిడ్‌ 19 ‌మూలంగా విద్యావ్యవస్థలో సమూల మార్పులు రానున్నాయి. అందుకు తగినట్టు విద్యార్థులు, తల్లిదండ్రులు సిద్ధం కావాల్సిందే.

అభినయ గేయాలు : ప్రాధమిక స్తాయి విద్యార్థులకు అభినయ గేయాలు, కథలు, నాటికలు లాంటి వీడియోలను చూపటం  మాత్రమే చేయాలి. మంచి సంగీతం పాటలతో ఆసక్తి కలిగిన చిత్రాల ద్వారా రూపొందించిన పాఠాల ద్వారా భోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి.

గురువుగా మెలగాలి : కొత్త అనుభవాన్ని ఎదుర్కొబోతున్న పిల్లలు అంత తొందరగా నూతన విద్యావిధానంను  అలవాటు చేసుకోలేక పోవచ్చు. విద్యార్థులు అంతగా ఆసక్తిని చూపించక పోవచ్చు. ఇంటర్నేట్‌ ‌సరిగా పనిచేయక పోవడం, వాయిస్‌ ‌సరిగా వినిపించక పోవడం, ఎలక్ట్రిసిటీ లేకపోవడం, ఫోన్‌ ‌కు తరచుగా కాల్స్ ‌రావడం, ఫోన్‌ ‌లో బ్యాటరీ చార్గింగ్‌ అయిపోవడం ఇలా ఎన్నో సమస్యలతో  ఆసక్తి కలిగించని రీతిలో ఆన్‌ ‌లైన్‌ ‌విద్యా విధానం కొనసాగితే తమకు రాదు అన్న భావన పిల్లల్లో పెరగడం, శాస్త్రీయ దృక్పథం కొరవడి మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లలు ఎదుర్కొంటున్న ఇలాంటి ఇబ్బందులను అర్థం చేసుకుంటూ గురువు పాత్ర పోషించాలి. పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడుపాలి. పిల్లలకు వచ్చే సందేహాలను తీర్చే ప్రయత్నం చేయాలి.

విరామం తప్పని సరి: పాఠశాలలో పీరియడ్‌ ‌లకు మధ్య ఉండే స్వల్ఫ విరామ సమయాన్ని ఆన్‌ ‌లైన్‌ ‌విద్యావిధానం ద్వారా తీసుకొనే విధంగా చూడాలి. ఒక పీరియడ్‌ ‌పూర్తి కాగానే ఏకాగ్రత శ్రద్ద తగ్గిపోతుందనే కారణంగా  అలాగే కంప్యూటర్‌/‌మొబైల్‌ ‌ఫోన్‌ ‌కె అతుక్కుపోకుండా స్వల్ఫ విరామం తప్పని సరిగా తీసుకోవాలి. ఇంట్లోనే అటు ఇటు తిరగాలి. వీలైతే బయటి వరండాలో కాసేపు అలా అలా తిరగాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఉత్సాహం పెరుగుతుంది.

పిల్లల మనో భావాలకు విలువ నివ్వాలి: పిల్లలు మాట్లాడే మాటలకు విలువనివ్వక  ఎప్పుడూ ఇలాగే సందేహాలు వస్తాయి అని విసుక్కోవడం ద్వారా  పిల్లల మనోభావాల్ని, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తాయి. పిల్లలు మనసులోని భావోద్వేగాలను వ్యక్తంచేసే స్వేచ్చాయుత వాతావరణం కల్పించాలి. పిల్లల అభిప్రాయాల్ని గౌరవిస్తూనే సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేయాలి. దీని ద్వారా పిల్లలు మీ పట్ల పాజిటివ్‌ ‌దృక్పథాన్ని పెంచుకుంటారు.

టీనేజ్‌ ‌పిల్లలను ఆకర్షించే అంశాలు :  ఆన్‌ ‌లైన్‌ ‌విద్యావిధానం లో అనవసర వెబ్‌ ‌సైట్‌ ‌లు ఆకర్షిస్తూ, పిల్లలను అటు వైపుగా వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కంటికి రెప్పలా పిల్లలను ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. వీటి వల్ల కలిగే పర్యవసానాలను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పటం తల్లిదండ్రుల బాధ్యత. వీటి గురించి నిస్సందేహంగా పిల్లలతో చర్చించాలి అనుమానాలను నివృత్తి చేయాలి.

స్నేహానికి ప్రాధాన్యత ఇవ్వాలి: స్కూల్‌ ‌లేదా కాలేజ్‌ ‌లో స్నేహితులు ఉంటారు. తీరిక సమయం దొరికితే తన భావాలను స్నేహితులతో పంచుకుంటారు. ఆన్‌ ‌లైన్‌ ‌విద్యావిధానం అయినప్పటికి స్నేహాన్ని , స్నేహితులను వదల కూడదు. పిల్లల ఒత్తిడి మాయం కావడానికి స్నేహితులు తప్పని సరి. స్నేహితులతో చేసే కాలక్షేప సమయం వీడియో కాలింగ్‌ ‌ద్వారా పిల్లలకు ప్రత్యక్ష అనుభవం కలిగించాలి.

మానసిక ఆరోగ్యానికి పాఠశాల సమయసారిని: ఎలాగూ స్కూల్‌ ‌కు వెళ్ళడం అంటూ లేదు కదా అని దినచర్యలో మార్పులు ఏర్పడుతాయి. పాఠశాల కు వెళ్తే ఏ విధంగా దిన చర్య ను కొనసాగిస్తారో అదే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. క్రమ బద్దమైన జీవన శైలి ని ఏర్పాటు చేసుకోవాలి. స్వీయ క్రమశిక్షణ అలవరచుకోవాలి. నిద్ర భోజన సమయాలను తప్పని సరిగా పాటించాలి.

డి విటమిన్‌: ‌రోజంతా ఇంట్లోనే కూర్చొని ఉంటే పిల్లలలో డి విటమిన్‌ ‌కొరవడే ప్రమాదం ఉంటుంది. సమయం తీసుకొని సూర్యరశ్మి అందుకునే విధంగా కాసేపు సూర్యుని కాంతిలో ఉండనివ్వాలి. కృత్రిమ గాలి కంటే సహజంగా లభించే గాలి కోసం పార్క్ ‌లకు తీసుకుని వెళ్ళాలి. పూర్తిగా ఇంటికే బంధిగా కాకుండా అప్పుడప్పుడు వాకింగ్‌ ‌కోసం తగు జాగ్రత్తలతో బయటకు లేదా దగ్గరలో ఉన్న గ్రౌండ్‌ ‌కు వెళ్ళాలి.

Leave a Reply