Take a fresh look at your lifestyle.

శిశువుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు శ్రద్ద చూపాలి

పిల్లలల్లో రోగ నిరోధక శక్తి పెంచేందుకు టీకాలు ఎంతో అవసరమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ జెడి నిర్వహించిన సమీక్ష సమావేశంలో శిశువుల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన చర్యలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య అధికారులను ఆదేశించిన నేపథ్యంలో అర్బన్‌ ‌జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో మాతా, శిశు సంరక్షణ కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శిశువుల ఆరోగ్యం పట్ల అత్యంత ప్రాముఖ్యమైన టీకాలు వేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు.

ప్రస్తుత కొరోనా వైరస్‌ ‌నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం పట్ల టీకాల ప్రాధాన్యతను తల్లిదండ్రులకు తెలియజేయడంతో పాటు టీకాల అవశ్యకతను కూడా పెంపొందించాల్సిన అవసరం ఉంది. పిల్లలల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతో విలువైన టీకాలను ప్రభుత్వం కోట్లాది రూపాయాలు ఖర్చు చేస్తూ ఉచితంగా అందింస్తున్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడం వల్ల కొందరు తల్లిదండ్రులు వేయించలేక పోతున్నారు. పిల్లలకు పుట్టుకతో వచ్చే పలు సమస్యలకు టీకానే సరైనే మందు క్షయ, కోరింత దగ్గు, పోలియో, ధనుర్వతం, తట్టు నిమోనియా, మెదడు వాపు వంటి పలు వ్యాధులకు టీకా ద్వారా సమర్ధవంతంగా నివారించే అవకాశాలు ఉన్నాయి. అప్పుడే పుట్టిన శిశువుతో పాటు ఆరు, పది, పద్నాలుగు వారాల తరువాత క్రమంగా టీకాల చుక్కులు వేస్తారు.

అనంతరం 20 నెలల లోపు వయస్సు వచ్చేంత వరకు నిజిల్‌ ‌టీకాతో పాటు విటమిన్‌ ‘ఎ’ ‌ద్రావణం, బుస్టర్‌ ‌డోసులను క్రమపద్దతిలో అందజేస్తారు. శిశువు ఎదిగే క్రమంలో దశల వారిగా వ్యాక్సినేషన్‌ ‌ద్వారా టీకాలు అందజేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న టీకాలపై తల్లిదండ్రులు అవగాహన కల్పించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటి ప్రచారం నిర్వహించడం, చిన్న పిల్లలు ఉన్న ఇంటికి వెళ్ళి టీకాలు వేయించడం జరుగుతుంది. పిల్లలకు జ్వరం, దగ్గు, ఉన్నప్పుడు మాత్రం టీకాలు వేయించకూడదు. మిగతా ఏ సమయంలోనైనా టీకాలు ఇవ్వవచ్చు. ఎదిగే శిశువులకు ఎంతో విలువైన టీకాలను వేయించడం ద్వారా ప్రమాదకరమైన ఎన్నో వ్యాధుల నుండి రక్షించే అవకాశం ఉంది. ప్రస్తుత కొరోనా వైరస్‌ ‌నేపథ్యంలో చిన్న పిల్లలకు, వృద్దులకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నట్లు వైద్య నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజారోగ్యంపై ప్రభుత్వం పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో వ్యాధి నిరోదక శక్తి పెంపొందించేందుకు ప్రతి కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తుంది.

సహజంగానే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడంతో పాటు సరైన సమయంలో వ్యాక్సినేషన్‌ ‌చేయడం ద్వారా పిల్ల)ల్లో రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుందన్నారు. కాలానుగుణంగా వచ్చే సీజనల్‌ ‌వ్యాధులను తట్టుకోవడంతో పాటు పలు రకాలైన అంటు, చర్మ వ్యాధులు, పలు రుగ్మతలు దరి చేరకుండా కాపాడుతుంది. పోలియో, మెదడు వాపు, కలర, వంటి వ్యాధుల ద్వారా శిశు మరణాలు ఎక్కువగా చోటు చేసుకోకుండా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ టీకాలు, వ్యాక్సినేషన్‌ ‌వంటి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకవస్తుంది. ప్రజలు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వినియోగించుకోవాలని వైద్యాధికారులు కోరుతున్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!