Take a fresh look at your lifestyle.

గ్రామాభివృద్ధికి రూ.8లక్షలు అందజేసిన పరమేశ్వర్‌రెడ్డి

parameshwara-reddy-donated-rs-8-lacks-for-village-development

నాగర్‌ ‌కర్నూల్‌,‌జనవరి 2 (ప్రజాతంత్ర విలేకరి): నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా తిమ్మాజీపేట్‌ ‌మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామా అభివృద్ధికి 8 లక్షల రూపాయలను విరాళంగా అందజేసిన ఆట అసోసియేషన్‌ అధ్యక్షుడు పరమేశ్వర్‌రెడ్డిని ఎమ్మెల్యే మర్రిజనార్ధన్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర నాయకులు జక్క రఘునంధన్‌రెడ్డిలు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఈసంధర్భంగా గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో  అందరూ భాగస్వామ్యం కావాలని, తమవంతు సహకారం అందించాలని సూచించారు.

Tags: Parameshwara Reddy, donated Rs 8 lakhs, village development, thimmajipet, aata association director

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply