Take a fresh look at your lifestyle.

పంట నష్టం అంచనాలు త్వరితగతిన రూపొందించాలి : కలెక్టర్‌

‌ఖమ్మం,ఏప్రిల్‌ 19 ‌ప్రజాతంత్ర (ప్రతినిధి) : అకాల వర్షాలు, గాలిదుమ్ములకు దెబ్బతిన్న ఉద్యాన పంట నష్టాల నివేదికలను త్వరితగతిన రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన ఉద్యాన పంటలను జిల్లా కలెక్టర్‌ ‌కర్ణన్‌ ‌మంళవారం పరిశీలించారు. జిల్లాలోని  రఘునాధపాలెం, మధిర, ఎరుపాలెం, చింతకాని, ఖమ్మం అర్బన్‌, ‌ముదిగొండ, కూసుమంచి, నేలకొండపల్లి మండలాలలో దెబ్బతిన్న మామిడి, మునగ, బొప్పాయి , కూరగాయ పంటలను జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జి.అనసూ య లు పరిశీలించారు. ఈ సందర్భంగా రఘనాధపాలెం మండలంలో సుమారు 40 ఎక రాలలో బొప్పాయి తోటలు పూర్తిగా నేలమట్టమ య్యాని ఉద్యాన అధికారులు కలెక్టర్‌కి వివరిం చారు. కోటపాడు రెవిన్యూ గ్రామంలో కొంటెము క్కుల రామారావు  చెందిన 4 ఎకరాలు, కొల్లి పిన్ని వెంకటేశ్వర్లు కు చెందిన 5 ఎకరాలు బొప్పా యితోట, లంతుల రిఈక కు చెందిన పట్టుపురు గులు పెంచే షెడ్డు ధ్వంసమైందని కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భ:గా కలెక్టర్‌ ‌జిల్లా వ్యాప్తంగా పంట నష్టం నివేదికలు రూపొందిం చాలని, వెంటనే ప్రభుత్వానికి పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంటనష్ట పోయిన రైతులందరి వివరాలు సేకరించాలని ఆదేశిం చారు. అలాగే ఎర్రుపాలెం, మధిర మండలాలలో ఈదురు గాలులకు దెబ్బదిన్న అరటి, మామిడి, బొప్పాయి ,కూరగాయ పంటలను జిల్లా ఉద్యాన వట్టుపరిశమ శాఖ అధికారి .అనసూయ  స్థానిక ఉద్యాన అధికారి ఆకుల వేణు తో కలిసి పరిశీలించారు. నేలకొండపల్లి, ముదిగొండ మండలం లో ఉద్యాన అధికారి శ్రీ జి.గణేష్‌, ‌సహాయ పట్టు పరిశ్రమ అధికారి పి.సమ్మయ్య, ఈదురు గాలులకు దెబ్బతిన్న మామిడి, బొప్పాయి పంటలను పరిశీలించారు. సత్తుపల్లి మండలాలు ఈదురు గాలులకు దెబ్బదిన్న మామిడి తోటను స్థానిక ఉద్యాన అధికారి కుమారి కె.మీనాక్షి పరిశీలించారు.ఈ పర్యటనలో స్థానిక తాశీల్దారు  నరసింహరావు. ఉద్యాన అధికారి గుడిమల్లం సందీప్‌ ‌కుమార్‌, ‌వ్యవసాయ అధికారి భాస్కర్‌, ‌గిర్దావర్‌ ‌శ్రావణి, సహాయ పట్టు పరిశ్రమ అధికారి శ్రీ కె.సురేష్‌, ఎ.‌శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Leave a Reply